ప్రవళిక ఆత్మహత్య కేసు.. స్పందించిన శివరామ్ సోదరుడు!

ప్రవళిక కేసుపై శివరామ్ రాథోడ్ సోదరుడు మునిరామ్ తొలిసారిగా స్పందించాడు. ఈ కేసులో మా అన్నయ్య శివరామ్ కు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే అతడిని ఇందులో ఇరికించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నాడు.

ప్రవళిక కేసుపై శివరామ్ రాథోడ్ సోదరుడు మునిరామ్ తొలిసారిగా స్పందించాడు. ఈ కేసులో మా అన్నయ్య శివరామ్ కు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే అతడిని ఇందులో ఇరికించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నాడు.

ఈ నెల 13న ప్రవళిక హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్పందించారు. శివరామ్ రాథోడ్ అనే యువకుడు మోసం చేశాడని, దీని కారణంగానే మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఇంతే కాకుండా ప్రవళిక ఆత్మహత్యకు కారణమైన శివరామ్ రాథోడ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు పరారీలో ఉన్న శివరామ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా.. శివరామ్ శుక్రవారం ఏకంగా నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం.. ఇందులో శివరామ్ రాథోడ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ శనివారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే శివరామ్ రాథోడ్ సోదరుడు మునిరామ్ తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రవళిక ఆత్మహత్య కేసులో మా అన్నయ్య శివరామ్ కు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే అతడిని ఇందులో ఇరికించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారిని అన్నాడు.

అసలేం జరిగిందంటే?

వరంగల్‌ జిల్లాలోని దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక అనే యువతి హైదరాబాద్ లోని అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ చదువుకునేది. అయితే ఈ నెల 13న ప్రవళిక హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుంది. మొదట్లో మాత్రం.. గ్రూప్ 2 వాయిదా పడిన కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్షాలు ఆరోపించగా కొందరు విద్యార్థులు సైతం వత్తాసు పలికారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై స్పందించి.. ఆమె ప్రియుడు శివరామ్ రాథోడ్ మోసం చేసిన కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఇదే ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

Show comments