10 ఏళ్లుగా దేశంలో అక్రమంగా జీవిస్తోన్న భార్యా భర్తలు.. ఎలా పట్టుబడ్డారంటే.?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు భార్యా భర్తలు. దేశంలో అక్రమంగా చొరబడి నివసిస్తున్నారు. ఐడెంటిటీని మార్చుకుని జీవనం సాగిస్తున్నారు. కానీ పోలీసులు వీరిని పట్టేసుకున్నారు. వీరు ఎలా దొరికేశారంటే...?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు భార్యా భర్తలు. దేశంలో అక్రమంగా చొరబడి నివసిస్తున్నారు. ఐడెంటిటీని మార్చుకుని జీవనం సాగిస్తున్నారు. కానీ పోలీసులు వీరిని పట్టేసుకున్నారు. వీరు ఎలా దొరికేశారంటే...?

గత 10 ఏళ్లుగా అధికారుల కళ్లు గప్పి ఇండియాలో అక్రమంగా నివసిస్తున్నారు ఈ భార్యా భర్తలు. నకిలీ పాస్ పోర్ట్, ఆధార్ కార్డులను సృష్టించి భారత్‌లో మకాం వేశారు. భర్త పాకిస్తాన్ కాగా, భార్య బంగ్లాదేశ్. ఈ ఇద్దరే కాదు.. ఫ్యామిలీ ఫ్యామిలీని ఇండియాకు తీసుకొచ్చారు. ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిపోయారు. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని గంటల్లో దేశం విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధమౌతుండగా క్యాచ్ చేశారు.  విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు వీరు ఎవరు.. ఎలా సిలికాన్ సిటీ బెంగళూరుకు వచ్చారు. పోలీసులకు ఎలా పట్టుబడ్డారో తెలియాలంటే ఈ స్టోరీ తెలుసుకోండి.

పాకిస్తాన్ పౌరుడైన రషీద్ అలీ సిద్దిఖీ.. బంగ్లాదేశ్ పౌరురాలైన అయేషా హనీఫ్.. భార్యా భర్తలు. ఈ ఇద్దరు శంకర్ శర్మ, అయేషా శర్మగా పేర్లు మార్చుకుని.. ఇండియాలోకి అడుగుపెట్టారు. 2014లో బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఢిల్లీలో మకాం వేశారు. ఢిల్లీలో ఉండగానే నకిలీ పాస్ పోర్టు, ఆధార్ కార్డులు సృష్టించుకున్నారు. ఇక 2018లో బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. అలాగే ఆయేషా తల్లిదండ్రులు రుబీ, హనీఫ్‌లు కూడా తమ ఐడెంటినీ మార్చుకుని ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ఆశా రాణి, రాం బాబు శర్మలగా మార్చుకున్నారు. అయితే ఇటీవల చెన్నై విమానాశ్రయంలో నలుగురు బంగ్లాదేశ్ వ్యక్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు.  పత్రాలు తనిఖీ చేయగా.. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. ఇండియన్ పాస్ పోర్ట్ పొందినట్లు తేలింది.

మెస్సియా ఫౌండేషన్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఢాకా వెళ్లి వస్తుండగా వీరు పట్టుబడ్డారు. వీరిని విచారించగా.. తమ తాము బెంగళూరులోని జిగానిలో తమ బంధువులతో కలిసి నివసిస్తున్నట్లు వెల్లడించారు. ఆ బంధువులే శంకర్ శర్మ అలియా రషీద్ అలీ సిద్దిఖీ.  వెంటనే బెంగళూరు శివారులో ఉన్న శంకర్ నివాసంపై దాడులు నిర్వహించారు పోలీసులు. ఆ సమయంలో ఇంట్లో సామాన్లు ప్యాక్ చేసి కనిపించాయి. వీరంతా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. పేర్లు అడగ్గా.. శంకర్ అంటూ చెప్పసాగాడు రషీద్. అనుమానం వచ్చిన పోలీసులు ఇళ్లంతా తనిఖీలు చేయగా.. ముస్లిం మత పెద్దల ఫోటోలు కనిపించాయి. దీంతో కుటుంబం అబద్దం చెబుతుందని నిర్దారించుకున్నారు.

నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాస్తవాలను వెల్లడించారు నిందితులు. పాకిస్తాన్‌కు చెందిన రషీద్.. ఇండియా వచ్చి ఇంజిన ఆయిల్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అలాగే ఆన్ లైన్ క్యాటరర్‌గా పనిచేశాడు. ఇదే సమయంలో స్థానికులను ఇస్లాం మతంలోకి మార్చేందుకు ఈ కుటుంబం కుట్ర పన్నిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నకిలీ పత్రాలు, ఆధార్ కార్డులు సృష్టించి 10 ఏళ్లుగా ఇండియాలో జీవిస్తున్నారని తేలింది. కర్ణాటక హోం మంత్రి జి. దేవుడు ఈ విషయంపై స్పందిస్తూ వీరు ఇక్కడకి ‘ఎలా వచ్చారు?’ ఎందుకు వచ్చారు? వీటన్నింటిపై విచారణ జరుపుతామన్నారు.

Show comments