సంచలనంగా మారిన ముచ్చుమర్రి బాలిక కేసులో నిందితుడు మృతి!

Muchumarri Case Suspect Hussain Passed Away: ముచ్చుమర్రి బాలిక హత్య కేసులో మరో సంచలనం విషయం జరిగింది. కేసులో నిందితుడిగా ఉన్న హుస్సేన్ శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Muchumarri Case Suspect Hussain Passed Away: ముచ్చుమర్రి బాలిక హత్య కేసులో మరో సంచలనం విషయం జరిగింది. కేసులో నిందితుడిగా ఉన్న హుస్సేన్ శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ముచ్చుమర్రి బాలిక(9) హత్య కేసులో మరో సంచలనంగా చోటుచేసుకుంది. బాలిక హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న హుస్సేన్(29) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు నంద్యాల జిల్లాలో కలకలంగా మారింది. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలకంగా మారాడు అనే అనుమానాలతో హుస్సేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కూడా చేపట్టారు. అయితే హుస్సేన్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం హుస్సేన్ తప్పించుకునే క్రమంలో అనారోగ్యంతో మృతి చందినట్లు చెబుతున్నారు.

నంద్యాలో సంచలనంగా మారిన ముచ్చుమర్రి బాలిక హత్య కేసులో ముగ్గురు మైనర్లు మాత్రమే కాకుండా.. మొదట ఓ తండ్రి, పెదనాన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో నిందితుల్లో ఒకరి మేనమామ హుస్సేన్ కీలకంగా వ్యవహరించాడనే అనుమానాలు పోలీసులకు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే హుస్సేన్ ను పోలీసులు మూడ్రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. మిడుతూరులోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ చేశారు అని. ఆ తర్వాత నంద్యాలలోని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని చెబుతున్నారు. అయితే పోలీస్ స్టేషన్ లో విచారిస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడని.. ఇద్దరిని తోడుగా ఇచ్చి ప్రభుత్వాస్పత్రికి పంపారని ప్రచారం జరుగుతోంది. అయితే అప్పటికే హుస్సేన్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

హుస్సేన్ మృతిపై ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా శనివారం విలేకరులతో మాట్లాడారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అనారోగ్య సమస్యతో హుస్సేన్ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. మసీదుపురం మెట్ట నుంచి నందికొట్కూరుకు తీసుకెళ్తుండగా తలముడిపి సమీపంలో పోలీసు జీపు నుంచి దూకి పారిపోయేందుకు యత్నించినట్లు తెలిపారు. అతడిని పోలీసులు వెంబడించి పట్టుకున్నట్లు చెప్పారు. ఆ సమయంలో అతను ఆయాసంతో ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో నంద్యాలలోని ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై మిడుతూరు పీఎస్ లో కేసు కూడా నమోదు చేశారు. హుస్సేన్ గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నట్లు ఆయన బంధువులు మెజిస్ట్రేట్ తో చెప్పినట్లు తెలిపారు. అలాగే పోస్టుమార్టాన్ని కూడా వీడియో తీయించామన్నారు. నిస్పక్షపాతంగా, చట్ట ప్రకారమే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Show comments