నర్సరీ విద్యార్థినులపై స్వీపర్‌ లై0గిక దాడి! మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో దారుణం..!

Badlapur, School Incident, Maharashtra: కామాంధుల ఆకలికి పసిపిల్లలు కూడా బలవుతున్నారు. కోల్‌కత్తా ఘటన దేశాన్ని కుదిపేస్తుండగానే.. ఓ స్కూల్‌లో నర్సరీ చిన్నారులపై లై0గిక దాడి జరిగింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Badlapur, School Incident, Maharashtra: కామాంధుల ఆకలికి పసిపిల్లలు కూడా బలవుతున్నారు. కోల్‌కత్తా ఘటన దేశాన్ని కుదిపేస్తుండగానే.. ఓ స్కూల్‌లో నర్సరీ చిన్నారులపై లై0గిక దాడి జరిగింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక వైపు ‘కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార’ ఘటనతో దేశం రగిలిపోతుండగానే.. మరో దారుణం చోటు చేసుకుంది. కామాంధుల కళ్లకు వయసు కూడా కనిపించకుండా పోతోంది. బోసి నవ్వులతో, బుడిబుడి అడుగులతో.. బుజ్జిబుజ్జి మాటలతో అల్లరి చేసే నాలుగేళ్ల చిన్నారులు కూడా మానవ మృగాలకు కామవాంఛకు బలైపోతున్నారు. వింటుంటేనే.. ఒళ్లు మండిపోతున్న ఈ ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లాలో గల బద్లాపూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

బద్లాపూర్‌లోని ఓ ప్రముఖ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న నర్సరీ సూడెంట్స్‌పై అదే స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేసే అక్షయ్‌ షిండే లై0గిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాఠశాలపై దాడికి దిగారు. స్కూల్‌లోని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి.. ఇద్దరు చిన్నారులపై ఈ అఘాయిత్యానికి అతను ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ‘కోల్‌కతా డాక్టర్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌’ ఘటనపై నిరసనలు కొనసాగుతున్న తరణంలో ఈ వార్త బయటికి రావడంతో థానె జిల్లా వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి.

జిల్లా బంద్‌కు నిరసనకారులు పిలుపునిచ్చారు. లోకల్‌ ట్రైన్స్‌ నడవకుండా.. రైల్వే ట్రాక్స్‌పై ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ.. కుటంబ సభ్యులు, ఆందోళన కారులు డిమాండ్‌ చేశారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న.. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ వెంటనే బద్లాపూర్‌కు ఒక కమిటీని పంపింది. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించి నివేదక సమర్పించాలని కోరింది. అయితే.. ఇలాంటి ఘటన జరగడం బాధకారం అంటూ పాఠశాల ఒక ప్రకటన చేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, క్యాంపస్‌ మొత్తం మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించింది. అయితే.. ఈ ఘటనపై ఆందోళనను ఉధృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments