Krishna Kowshik
ఆన్‌లైన్‌లో ఐఫోన్ ఆర్డర్ చేశాడో వ్యక్తి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు. ఐ ఫోన్ తీసుకుని డెలివరీ అడ్రస్ వద్దకు వెళ్లాడు డెలివరీ బాయ్. కస్టమర్ చేతిలో ఫోన్ పెట్టి.. డబ్బులు అడిగాడు. అంతే..
ఆన్‌లైన్‌లో ఐఫోన్ ఆర్డర్ చేశాడో వ్యక్తి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు. ఐ ఫోన్ తీసుకుని డెలివరీ అడ్రస్ వద్దకు వెళ్లాడు డెలివరీ బాయ్. కస్టమర్ చేతిలో ఫోన్ పెట్టి.. డబ్బులు అడిగాడు. అంతే..
Krishna Kowshik
పండుగ వేళ కావడంతో ఈ కామర్స్ సంస్థలు స్పెషల్ ఆఫర్లను తీసుకు వచ్చాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రతి వస్తువుపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మొబైల్స్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్లు.. ఇలా ప్రతి వస్తువుపై ఆఫర్లను ప్రకటించాయి. ఇక మొబైల్స్ అయితే పండుగతో సంబంధం లేకుండా ఆర్డర్ చేసుకున్న మరుసటి రోజే చేతిలో వాలిపోతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి ప్లిఫ్ కార్డు వెబ్ సైట్ నుండి ఐ ఫోన్ ఆర్డర్ చేసుకున్నాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఫోన్ తీసుకుని డెలివరీ బాయ్ సదరు అడ్రస్‌కు వెళ్లాడు. కస్టమర్ చేతిలో ఫోన్ పెట్టి.. డబ్బులు చెల్లించాలని కోరాడు. ఆ డబ్బులు చెల్లించేందుకు ఆలోచించిన కస్టమర్.. డెలివరీ బాయ్‌ను చంపేస్తే ఆ నగదు కట్టక్కర్లేదని భావించాడు. స్నేహితుడి సాయంతో హత్య చేశాడు. ఈ షాకింగ్ ఇన్నిడెంట్ ఉత్తరప్రదేశ్ లక్నోలో చోటుచేసుకుంది.
లక్నోలోని నిషాత్ గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు భరత్ సాహు. అతడు ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా ఇదే వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 23న ఉదయం డ్యూటీకి వెళ్లాడు. అయితే గజానన్ అనే వ్యక్తి ఈ ఈ కామర్స్ సంస్థ నుండి యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ ఆర్డర్ చేసుకున్నాడు. ఐఫోన్ విలువ రూ. 1.5 లక్షల కావడంతో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. దీంతో ఐఫోన్ డెలివరీ చేసేందుకు గజానన్ ఇంటికి వెళ్లాడు భరత్ సాహు. ఫోన్ గజానన్ చేతిలో పెట్టి.. డబ్బులు చెల్లించాలంటూ కోరాడు. అయితే డెలివరీ బాయ్ అక్కడే ఉండమని చెప్పి.. డబ్బులు తెస్తున్నానని డ్రామా చేశాడు. ఇతడి డ్రామాను పసిగట్టలేకపోయాడు డెలివరీ బాయ్. బయట వెయిట్ చేస్తున్నాడు. అయితే ఈ డబ్బులు చెల్లించడం ఏ మాత్రం ఇష్టం లేని గజానన్.. అతడ్ని అంతమొందిస్తే.. ఆ డబ్బులు కట్టక్కర్లేదని భావించాడు. తన స్నేహితుడితో కలిసి భరత్ సాహును గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో వేసి ఇందిరా కెనాల్లో పారేశారు.
అయితే రెండు రోజులుగా భరత్ ఇంటికి రాకపోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. భరత్ సాహు కాల్ రికార్డులు పరిశీలించగా.. గజానన్ అనే వ్యక్తికి కాల్ చేసినట్లు గుర్తించారు. అదే సమయంలో అతడి చివరి లోకేషన్ గుర్తించి.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఆధారాలు లభించాక.. ఆకాష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని పట్టుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. ఐఫోన్‌కు డబ్బులివ్వకుండా ఎగ్గొట్టేందుకే డెలివరీ బాయ్ భరత్ సాహును గొంతు నులిమి హత్య చేసి, గోనె సంచిలో కట్టి కెనాల్లో పడేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి భరత్ సాహు మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. భరత్ సోదరుడు ప్రేమ్ కుమార్ మృతికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు.