అక్కని చంపిన చెల్లి! ఆరోజు ఇంట్లో జరిగిన మొత్తం కథ!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దీప్తి హత్య మీస్టరీ ఎట్టకేలకు విడింది. పోలీసుల ప్రాథమిక విచారణలో అక్క దీప్తిని చెల్లెలు చందనే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే గత మూడు రోజులుగా పరారీలో ఉన్న చెల్లెలు చందనను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా విడిపోయి తీవ్రంగా శ్రమించారు. ఇక సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చందన, ఆమె స్నేహితుడితో ఒంగోలులో ఉన్నట్లు పోలీసులు గుర్తించాు. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దీప్తి చెల్లెలు చందన పాటు ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని నేరుగా కోరుట్లకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. గత మూడు రోజులుగా నడిచిన దీప్తి ఎపిసోడ్ లో అసలేం జరిగిందంటే?

అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?

జగిత్యాల జిల్లాలో కోరుట్లలో దీప్తి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంటి వద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. అయితే ఆగస్టు 29వ రోజు ఆమె తల్లిదండ్రులు తమ బంధువుల గృహ ప్రవేశం ఉండడంతో హైదరాబాద్ వెళ్లారు. ఆ రోజు ఇంట్లో దీప్తితో పాటు ఆమె చెల్లెలు చందన ఉన్నారు. అదే రోజు రాత్రి 10 గంటల వరకు ఇద్దరు అక్కా చెల్లెళ్లు కలిసి తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు. కట్ చేస్తే.. ఆగస్టు 30వ రోజు తెల్లవారు జామున దీప్తి తల్లిదండ్రులు కూతుళ్లకు ఫోన్ చేశారు. ఇద్దరూ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే పక్కింటి వ్యక్తులకు ఫోన్ చేశారు. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా.. దీప్తి సోఫాలో శవమై కనిపించింది. ఈ సీన్ చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వెంటనే వాళ్లు హుటాహుటిన ఇంటికి చేరుకుని కూతురు దీప్తిని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారి ఇంటికి చేరుకుని ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించారు. ఇదే కాకుండా ఇంట్లోని కిచెన్ లో దొరికిన ఓడ్కా, బ్రీజర్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. అయితే అదే రోజు రాత్రి మృతురాలి చెల్లెలు చందన అదృశ్యమవ్వడంతో ఈ కేసులో అనుమానం మరింత బలపడింది. మరో విషయం ఏంటంటే? అదే ఇంట్లో నుంచి చందన రూ.2 లక్షల నగదు, 90 లక్షల విలువైన బంగారు అభరణాలు సైతం దొంగిలించింది. ఈ క్రమంలోనే అక్క దీప్తిని చెల్లెలు చందనే హత్య చేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

ఇందులో భాగంగానే పోలీసులు కోరుట్ల బస్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా .. అందులో చందన, ఆమె స్నేహితుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అదే రోజు పరారైన దీప్తి చెల్లెలు చందన.. తన తమ్ముడైన సాయికి వాట్సాప్ లో ఆడియో మెసేజ్ పంపింది. అందులో ఏముందంటే? ” అరేయ్ సాయి నేను చందన అక్కను. నేను దీప్తి అక్కను చంపలేదురా, అసలేం జరిగిందో నాకేం తెలియదు. రాత్రి అక్క, నేను కలసి మద్యం తాగాలని అనుకున్నాము. దీంతో మా ఫ్రెండ్ తో వైన్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగాను, అక్క మాత్రం ఆఫ్ బాటిల్ ఓడ్కా తాగింది. ఆ తర్వాత అక్క ఆమె బాయ్ ఫ్రెండ్ ను రమ్మంటాను అని చెప్పింది. నేను వద్దన్నాను. ఆ తర్వాత ఫోన్ మాట్లడి సోఫాలో పడుకుంది. లేపే ప్రయత్నం చేశాను, కానీ ఆమె లేవలేదు. ఇక ఇదే మంచి టైమ్ అనుకుని నేను వెళ్లిపోయాను. ఆ తర్వాత ఏం జరగిందో నాకు అస్సలు తెలియదు సాయి. నన్ను నమ్ము. నాకు అక్కను చంపేంత అవసరం ఏముందిరా” అంటూ మొసలి కన్నీరు కార్చింది.

ప్రాథమిక విచారణలో ఏం తేలిందంటే?

అదే ఆడియో రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు బృందాలుగా విడిపోయి చందన ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మూడు రోజుల పాటు శ్రమించిన పోలీసులు శనివారం చందన ఒంగోలులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని చందనతో పాటు ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. అటు నుంచి నేరుగా వారిని కోరుట్లకు తరలించనున్నారని సమాచారం. ఇక పోలీసుల ప్రాథమిక విచారణ మాత్రం.. చందన మరో మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని, దీనికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని.. ఈ విషయమై చందన, దీప్తి గొడవపడ్డారు. కోపంతో అక్క దీప్తిని చందన చంపింది. ఈ విషయాన్ని విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Show comments