కల్‌కత్తా డాక్టర్‌ బాడీలో 150mg వీర్యం అంటూ కథనాలు? పోలీసులు ఏం చెప్పారంటే?

కల్‌కత్తా డాక్టర్‌ బాడీలో 150mg వీర్యం అంటూ కథనాలు? పోలీసులు ఏం చెప్పారంటే?

Kolkata Doctor Case, RG Kar MCH, Crime News: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. డాక్టర్ల నిరసనకు కారణం అయిన.. ‘కోల్‌కత్తా డాక్టర్‌’ హత్యాచార ఘటనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్‌ అవుతున్నాయి. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

Kolkata Doctor Case, RG Kar MCH, Crime News: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. డాక్టర్ల నిరసనకు కారణం అయిన.. ‘కోల్‌కత్తా డాక్టర్‌’ హత్యాచార ఘటనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్‌ అవుతున్నాయి. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

దేశాన్ని కుదిపేస్తున్న ‘కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచారం’ ఘటనలో భయంకరమైన విషయాలు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం అవుతున్నాయి. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌ది గ్యాంగ్‌ రేప్‌ అంటూ, ఆమె శరీరంలో ఏకంగా 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉందని పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలినట్లు, ఆమెతో పాటు చదివిన కొంత మంది ఈ దారుణానికి పాల్పడినట్లు.. ఓ పెద్ద రాజకీయ నాయకుడి కొడుకు కూడా ఇందులో ఉన్నట్లు.. ఇలా రకరకాల పుకార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే మీ వాట్సాప్‌లలో ‘#JusticeForMoumita’ అంటూ కొన్ని వీడియోలు, ఫొటోలు వచ్చే ఉంటాయి. మరి ఇవన్నీ నిజమేనా? అసలు ఈ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ నెల 8వ తేదీన కోల్‌కత్తాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లోని సెమినార్‌ హాల్‌లో ఓ ట్రైనీ డాక్టర్‌ శవమై కనిపించింది. పోలీసులు వచ్చి.. ప్రాథమిక దర్యాప్తు చేసి.. శవ పరీక్ష నిర్వహించిన తర్వాత.. ఎవరో అత్యాచారం చేసి, ఆపై అతి క్రూరంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా డాక్టర్లు ఉలిక్కిపడ్డారు. బాధితురాలికి న్యాయం జరగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని గత పది రోజులుగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అయితే.. ఈ ఘటనపై నెటిజన్లు అగ్రెసివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు(శనివారం, ఆగస్టు 17) దేశవ్యాప్తంగా వైద్య సేవల బంద్‌కు ఐఏంఏ పిలుపునిచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలి, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ.. దేశవ్యాప్తంగా ఇంత ఉధృతంగా ఉద్యమం సాగుతుంటే.. సోషల్‌ మీడియాలో కొన్ని పుకార్లు పుంకాను పుంకానుగా పుట్టుకొస్తున్నాయి.

అలాంటి వాటిలో అతి ముఖ్యమైనది.. డాక్టర్‌ బాడీలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు రిపోర్ట్‌లో ఉందనేది ఒకటి. అయితే.. ఇది నిజం కాదని కోల్‌కత్తా పోలీస్‌ చీఫ్‌ వినీత్‌ గోయల్‌ స్పష్టం చేశారు. 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో లేదని, అత్యాచారం జరిగిన విషయం వాస్తవమే అయినా.. 150 మిల్లీ గ్రాముల వీర్యం అనే విషయం నిజం కాదని వెల్లడించారు. అయితే.. ఈ విషయం ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటే.. బాధితురాలి కుటుంబసభ్యులు కోర్టులో వేసిన పిటీషన్‌లో ఈ అంశం పేర్కొన్నారు. అలాగే కొంతమంది డాక్టర్లను కూడా అనుమానితులుగా పేర్కొన్నారు అందుకే ఈ అంశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కేసులో సివిక్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ని ఇప్పటికే పోలీస్‌లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా.. అతి దారుణంగా హత్యాచారానికి గురైన డాక్టర్‌కు న్యాయం జరిగి తీరాల్సిందే. మరి ఈ కేసు విషయంలో అవాస్తవాలు ప్రచారంలో ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments