SNP
Kolkata Doctor Case, RG Kar Medical College: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. పెద్ద ఎత్తున డాక్టర్ల నిరసనలకు కారణమైన.. ‘కోల్‌కత్తా డాక్టర్’ హత్యాచార ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Kolkata Doctor Case, RG Kar Medical College: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. పెద్ద ఎత్తున డాక్టర్ల నిరసనలకు కారణమైన.. ‘కోల్‌కత్తా డాక్టర్’ హత్యాచార ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
కోల్‌కత్తా డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను అత్యాచారం చేసి, ఆపై అతి క్రూరంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ.. దేశవ్యాప్తంగా డాక్టర్లు, ట్రైనీ డాక్టర్లు, నర్సులు గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ‘నో సెఫ్టీ నో డ్యూటీ’ ‘వీ వాంట్ జస్టిస్’ ‘జస్టిస్ టూ కోల్‌కత్తా డాక్టర్’ అంటూ సోషల్ మీడియాలో సైతం హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. యావత్ దేశాన్ని కుదిపేస్తున్న ఈ ‘కోల్‌కత్తా డాక్టర్ రేప్ అండ్ మర్డర్’ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రభుత్వ ఆధీనంలో నడిచే.. కోల్‌కత్తాలోని ‘ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్’లో ఈ నెల 8(గురువారం)న.. 32 ఏళ్ల డాక్టర్ విగతజీవిగా పడి ఉంది. గురువారం రాత్రి ఆమెను ఎవరో రేప్ చేసి.. అత్యంత దారుణంగా హత్య చేశారు. కళ్లు, నోరు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అయినట్లు ఆటోప్సీ(శవపరీక్ష) రిపోర్ట్‌లో వెల్లడైంది. ఆమె ఎడమ కాలు, మెడ, కుడి చేయి, ఉంగరపు వేలు, పెదవులపై కూడా గాయాలు ఉన్నట్లు రిపోర్ట్‌లో ఉంది. ఆ రోజు ఆమె నైట్ డ్యూటీలో ఉన్నారు. శుక్రవారం మెడికల్ కాలేజీకి వచ్చిన పోలీసలు.. గురువారం రాత్రి 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్దారించారు.
ఈ కేసులో కోల్‌కత్తా పోలీసులు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను సివిక్ వాలంటీర్(పౌర స్వచ్ఛంద సేవకుడు)గా పనిచేస్తున్నాడు. కోల్‌కత్తా పోలీస్ డిపార్డ్‌మెంట్‌లో ఈ వ్యవస్థ ఉంది. వీరిని వాలంటీర్లుగా తీసుకుంటారు.. ఈ సివిక్ వాలంటీర్లు ట్రాఫిక్ నిర్వహణ, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పోలీసులకు సహాయం చేయడానికి కాంట్రాక్ట్ బేసిక్‌పై రిక్రూట్ అవుతారు. వీరికి నెలకు దాదాపు రూ.12 వేలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది. అయితే.. సివిక్ వాలంటీర్లు పోలీసులు కాదు. కానీ, ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి మాత్రం తానో పోలీస్ అధికారినంటూ.. అందరితో చెప్పుకుంటూ తిరిగే వాడు.
సంజయ్ రాయ్ 2019లో కోల్‌కత్తా పోలీస్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌లో వాలంటీర్‌గా చేరాడు. కానీ, తర్వాత పోలీసు వెల్ఫేర్ సెల్‌కి మార్చారు. కొన్ని నెలల క్రితం నుంచి ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. కేవలం వాలంటీర్ మాత్రమే అయినా తను.. కోల్‌కత్తా పోలీస్ అనే ముద్ర ఉండే టీషర్ట్ వేసుకుంటూ.. అందరికి తాను పోలీస్ అంటూ నమ్మిస్తూ.. మెడికల్ కాలేజీలోని అన్ని క్యాంపస్‌లు, హాస్పిటల్‌లోని అన్ని బ్లాక్‌లకు నేరుగా వెళ్లిపోయేవాడు. అతనికి అనుమతి లేని చోట్లలో కూడా యధేశ్చగా తిరిగేవాడు.
మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో తిరుగుతూ ఓ డాక్టర్‌పై కన్నేశాడు సంజయ్ రాయ్. గురువారం రాత్రి ఎమర్జెన్సీ బ్లాక్‌లో నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత చాలా సేపటికి అక్కడ నుంచి బయటికి వచ్చాడు. తెల్లవారిన తర్వాత డాక్టర్ నేలపై విగతజీవిగా పడి ఉండటాన్ని కొంతమంది చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఎమర్జెన్సీ బ్లాక్‌లోకి సంజయ్ రాయ్ రాత్రి 4 గంటల సమయంలో వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఆధారంగా గుర్తించారు . అలాగే కొద్ది సేపటి తర్వాత అతను బయటికి వస్తున్నట్లు కూడా అందులో ఉంది.
డాక్టర్ మృతదేహం పక్కన ఒక బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ పోలీసులకు దొరికింది. రాత్రి 4 గంటల సమయంలో సంజయ్ రాయ్ ఎమర్జెన్సీ బ్లాక్‌లోకి వెళ్లిన సమయంలో అతని మెడలో ఆ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ఉన్నాయి. కానీ, బయటకి వచ్చే సమయంలో లేవు. పైగా ఆ ఇయర్ ఫోన్స్ సంజయ్ ఫోన్‌కు కనెక్ట్ అయి ఉన్నాయి. దీంతో సంజయ్ రాయ్.. డాక్టర్‌పై అత్యాచారం చేసి, ఆమె ఎక్కడ విషయం బయటపెడుతుందోనని.. ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు.
సీసీటీవీ, బ్లూటూత్ ఆధారాలతో సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. డాక్టర్‌పై హత్యాచారం చేసిన రాత్రి.. నేరుగా ఇంటికి వచ్చిన సంజయ్ రాయ్ స్నానం చేసి, ఎవరికి అనుమానం రావొద్దని రక్తం అంటుకున్న తన బట్టలు తానే ఉతుక్కున్నాడు. ఒక మహిళను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసి.. ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఉదయం అతని ఇంటికి వచ్చిన పోలీసులు.. అతని షూపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా అతన్ని నిందితుడిగా గుర్తిస్తూ.. అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్లో పోర్నోగ్రాఫి వీడియోలు చాలా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. పోర్న్ వీడియోలకు బానిసై అతను ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.
ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 23కు కేసు విచారణను వాయిదా వేసింది కోర్టు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన, ప్రదర్శనలకు దిగారు. తమకు రక్షణ లేకుండా పోతుందని, ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ల సంఘాలు కోరుతున్నాయి. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా స్పందించారు. దేశాన్ని కుదిపేస్తున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kolkata doctors on the streets.
Massive rally over CR Avenue, converging point RG Kar Medical College.
We demand justice, we demand transparency, we demand punishment for the heinous crime committed against our fellow doctor. #BengalHorror pic.twitter.com/UIURdG6TMf
— Ila (@TheDimpledDoc) August 12, 2024
Breaking: #KolkataPolice #CivicVolunteer Sanjoy Roy sent to 14 days police remand for raping & murdering on-duty doctor at #Kolkata’s #RGKar govt Hospital.
While seeking remand,govt counsel drew #Nirbhaya case similarity.
No lawyer represented the accused at the ACJM court. pic.twitter.com/djr6dWg6CR
— Sreyashi Dey (@SreyashiDey) August 10, 2024
Kolkata: Brutal Rape & Murder of a 2nd-year PG Trainee Doctor at RG Kar Hospital.
This case is similar to the 2012 Nirbhaya case. [ Public Prosecutor]
She was brutally assaulted, injuries on lips, broken collar bone, her sternum & pelvis broken, kiIIed & then raped, reports ABP… pic.twitter.com/N0V0vY1eg2
— زماں (@Delhiite_) August 11, 2024
An on-duty female doctor Dr. Moumita Debnath was raped & murdered inside her own department at R.G.Kar Medical College,one of prominent hospitals in Kolkata, in the middle of the night. Now police are trying to cover up the case ! Shame !!#RGKarMedicalcollege #justice pic.twitter.com/sboJnWwNAH
— 𝙶𝚘𝚞𝚛𝚊𝚗𝚐𝚘 (@Gourango_) August 10, 2024
Why no buzz about this horrific case from Kolkata where a female doctor was brutally raped and killed? Read the spine chilling medical reports. https://t.co/eYkWdS62gt pic.twitter.com/FQYrShfbzX
— Ruchi 𝕏 (@Ruchi4Tweets) August 10, 2024