దేశాన్ని కుదిపేస్తున్న యువతి హత్య! అసలేం జరిగిందంటే?

ఈ యువతి హత్య ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. విద్యార్థులు, మానవతావాదులు రాస్తరోకోలు చేస్తున్నారు. ఇంతకు ఈ యువతిని హత్య చేసింది ఎవరు? అసలేం జరిగిందంటే?

ఈ యువతి హత్య ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. విద్యార్థులు, మానవతావాదులు రాస్తరోకోలు చేస్తున్నారు. ఇంతకు ఈ యువతిని హత్య చేసింది ఎవరు? అసలేం జరిగిందంటే?

ఈ రోజుల్లో హత్యలు, ఆత్మహత్యలు రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొందరు దంపతులు.. ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతూ.. గోరుతో పోయేదాన్ని చివరికి గొడ్డలిదాక తెచ్చుకుంటున్నారు. ఇంతటితో సరిపెట్టకుండా చివరికి హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు పోలీసులు అనేక సందర్భాల్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 11న జరిగిన ఈ యువతి హత్య ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఎందరో మానవతావాదులు, విద్యార్థులు రాస్తారోకోలు చేస్తున్నారు. ఇంతకు ఈ యువతిని హత్య చేసింది ఎవరు? దేశాన్ని కుదిపేస్తోన్న ఈ యువతి హత్య వెనుక అసలేం జరిగిందంటే?

నేషనల్ మీడియా కథనం ప్రకారం.. ఇటలీకి చెందిన జ్యులియా సికెట్టిన్ అనే 22 ఏళ్ల యువతి డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. మరో విషయం ఏంటంటే? ఈ యువతి ఫిలిప్పో ట్యురెట్టా అనే యువకుడిని ప్రేమించింది. అతడు కూడా జ్యులియా సికెట్టిన్ ను ప్రేమించాడు. చాలా కాలం నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. త్వరలో గ్రాడ్యుయేషన్ డే ఉండడంతో నవంబర్ 11న జ్యులియా సికెట్టిన్ తన ప్రియుడితో కలిసి షాపింగ్ కు వెళ్లింది. ఆ రోజు నుంచి ఇద్దరు కనిపించకుండాపోయారు.

అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పటి నుంచి వీరి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కట్ చేస్తే.. వారం రోజుల తర్వాత ఓ గుంతలో పడి ఉన్న నల్లటి ప్లాస్టిక్ కవర్ లో జ్యులియా సికెట్టిన్ శవమై కనిపించింది. ఈ సీన్ చూసిన స్థానికులు షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతి ఒంటిపై దాదాపు 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కొన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలించగా సంచలన దృశ్యాలు బయటకొచ్చాయి. అందులో జ్యులియా సికెట్టిన్ ను ఆమె ప్రియుడు కొడుతున్నట్లు స్పష్టంగా కనిపించాయి. ఈ క్రమంలో ఆమె అరవకుండా మూతికి ప్లాస్టర్ కూడా చుట్టినట్లు సమాచారం.

ఆ తర్వాత పోలీసులు అలెర్ట్ అయి.. మృతురాలి ప్రియుడిని పట్టుకునేందుకు అతడి కోసం గాలించారు. ఇంతే కాకుండా పోలీసులు ఇంటర్ నేషనల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే వారం రోజుల తర్వాత మృతురాలి ప్రియుడు ట్యురెట్టాను జర్మనీలో అరెస్ట్ చేశారు. ఇక ఈ హత్య ఘటనపై పోలీసులు పూర్తిగా విచారిస్తున్నారు. మరో విషయం ఏంటంటే? జ్యులియా సికెట్టిన్ హత్య ఘటనతో ఇప్పుడు ఇటలీ మొత్తం అట్టుడుకుతోంది. ఆ యువతిని అన్యాయంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతే కాకుండా విద్యార్థులు, మానవతావాదులు రాస్తారోకోలు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు ఇటలీని కుదిపేస్తుండడం విశేషం.

Show comments