P Krishna
ఇటీవల కొంతమంది సిద్ద వైద్యులని చెప్పుకొని ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వెళితే.. లేనిపోని మందులు ఇచ్చి ప్రాణల మీదకు తీసుకు వస్తున్నారు.
ఇటీవల కొంతమంది సిద్ద వైద్యులని చెప్పుకొని ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వెళితే.. లేనిపోని మందులు ఇచ్చి ప్రాణల మీదకు తీసుకు వస్తున్నారు.
P Krishna
భారత దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది పథంలో ముందుకు సాగుతుంది. వైద్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అంతరిక్షంలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ.. ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నారు. కానీ.. ఇప్పటికే దేశంలో మూఢ నమ్మకాల పై విశ్వాసం తగ్గలేదు. ఇప్పటికీ కొంతమంది స్వామీజీలు, సిద్దులను నమ్ముతూ దారుణంగా మోసపోతున్నారు. కొంతమంది పూజల పేరుతో నరబలులు ఇస్తున్నారు. ఇలాంటి కేసులు దేశంలో ఎక్కడో అక్కడ నమోదు అవుతూనే ఉన్నాయి. తంజావూర్‌లో ఒక కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అస్తిపంజరాలు బయటపడటంతో తీవ్ర కలకం రేగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని తంజావూర్ జిల్లా సోలంపూరం లో హూమో సెక్స్ వ్యవహారంలో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చోళాపురం డ్రైవర్ అశోక్ రాజన్ (27) మిస్సింగ్ కేసు దర్యాప్తులో ట్విస్ట్ వెలుగు చూసింది. అశోక్ రాజన్ ని హత్య చేసి ఇంట్లో పూడ్చి పెట్టిన కేసులో నాటు వైద్యుడు కేశవమూర్తి (47) ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అశోక్ రాజన్ మృతదేహాన్ని వెలికితీసే క్రమంలో పలు అస్తి పంజరాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ అస్తిపంజరాల్లో ఒకటి 2021 లో అదృశ్యమైన కేశవమూర్తి స్నేహితుడు మహ్మద్ అనాస్ మృతదేహం అని అనుమానిస్తున్నారు. నిర్ధారణ కోసం ఆ ఆస్తిపంజరాన్ని ఫోరెన్సిక్ టెస్ట్ కోసం పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.
కుంభకోణం సమీపంలోని చోళపురం మహారాజపురం ఇసుక గుట్ట ప్రాంతానికి చెందిన హోండావ్ పాండ్యన్ కుమారుడు అశోక్ రాజన్. కొంతకాలంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దీపావళికి ముందు చోళాపురంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన అశోక్ రాజన్ అదృశ్యమయ్యాడు. అశోక్ రాజన్ అమ్మమ్మ పద్మిని ఫిర్యాదు మేరకు చోళపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. దర్యాప్తులో విస్తృత నిజాలు బయట పడ్డాయి. మృతుడు అశోక్ రాజన్.. సిద్ద వైద్యుడు కేశవ మూర్తి ఇంటికి వెళ్లగా.. అతడు లింగ నిర్ధారణ చేయాలని అనడంతో అశోక్ రాజన్ అందుకు నిరాకరించాడు. అదే సమయంలో కేశవమూర్తి మందు ఇవ్వగా అశోక్ రాజన్ స్పృహతప్పి పడి మృతి చెందాడు. భయంతో నాటు వైద్యుడు అతన్ని తన ఇంటి పరిసరాల్లో పూడ్చిపెట్టాడు. ఈ కేసులో కేశవమూర్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి ఇంటి నుంచి డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి ఇంటి ఆవరణలో ప్రొక్లయినర్ తో తవ్వకాలు జరపగా మరిన్ని అస్తిపంజరాలు బయటపడటంతో ఆశ్చర్యపోయారు. కేశవమూర్తి పదోతరగతి వరకు చదివి.. చెన్నైలో సిద్ద వైద్యంలో శిక్షణ పొందినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేయనున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.