ఈ యాక్సిడెంట్.. దేశాన్ని షేక్ చేస్తోంది! అసలు తప్పు ఎవరిది? పూర్తి వివరాలు!

రంజాన్ పండుగ.. అందరూ పిల్లలు ఇంట్లో ఉండి సెలవును ఎంజాయ్ చేస్తే.. ఈ విద్యార్థులు మాత్రం పాఠశాలకు వెళుతూ మృత్యువాత పడ్డారు. దేశాన్ని కుదిపేసిన ఈ బస్సు ట్రాజెడీ వెనుక.. లెక్కలేనంత నిర్లక్ష్యం కనిపిస్తుంది.

రంజాన్ పండుగ.. అందరూ పిల్లలు ఇంట్లో ఉండి సెలవును ఎంజాయ్ చేస్తే.. ఈ విద్యార్థులు మాత్రం పాఠశాలకు వెళుతూ మృత్యువాత పడ్డారు. దేశాన్ని కుదిపేసిన ఈ బస్సు ట్రాజెడీ వెనుక.. లెక్కలేనంత నిర్లక్ష్యం కనిపిస్తుంది.

రోడ్లు రక్తమోడుతున్నాయి. పనులు, ఉద్యోగాల పేరిట బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. చివరకు ప్రమాదం నుండి తప్పించుకుంటే భూమి మీద నూకలు ఉన్నట్లే. అయితే కొంత మంది ఈ రోడ్ యాక్సిడెంట్లకు బలౌతున్నారు. ఈ ప్రమాదాల్లో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడమే కాదు.. గారబంగా పెంచుకుంటున్న చిన్నారులు కూడా మృత్యువాత పడుతున్నారు. తాజాగా హర్యానాలోని మహేంద్రగఢ్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు.. స్కూల్ పిల్లలు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కారణం.. సెలవు రోజు స్కూల్ తెరవడం. స్కూల్ బస్సులో బడికి వెళుతున్న చిన్నారులు మృత్యువాత పడటం.

వివరాల్లోకి వెళితే.. మహేంద్ర గఢ్‌లో స్కూల్ వ్యాన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ గురువారం జీఎల్ పబ్లిక్ స్కూల్ బస్సు దాదాపు 40 మంది విద్యార్థులను పికప్ చేసుకుని పాఠశాలకు బయలు దేరింది. కనీనాలోని గ్రామంలో ఈ బస్సు ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనం బోల్తా పడింది. ఆరుగురు అభం శుభం తెలియని విద్యార్థులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సైతం దిగ్బ్రాంతి గురి చేశారు. అలాగే సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్ దీప్తి, బస్సు డ్రైవర్ ధర్మేంద్ర, స్కూల్ సెక్రటరీలను అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ యాక్సిడెంట్ వెనుక నిర్లక్ష్యం ఒక్కొక్కటిగా వెలుగుచూసింది. ఇదే ఆరుగురు విద్యార్థుల ప్రాణాలు గాల్లోకి కలిసేలా చేసింది.  గురువారం దేశ వ్యాప్తంగా రంజాన్ సందర్భంగా పాఠశాలలకు సెలవులు. ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు అయినప్పటికీ.. ఆ రోజు ఈ స్కూల్ తెరవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా బస్సు ఫిటెనెస్ సర్టిఫికేట్ గడువు ఆరేళ్ల క్రితమే ముగిసిందని తెలుస్తోంది. అతి వేగమే ఈ పిల్లల ప్రాణాలు కోల్పోయేలా చేసింది. విచారణలో బస్సు డ్రైవర్ మద్యం సేవించినట్లు తేలింది. ఈ బస్సుకు ఇటీవల నిర్దిష్ట పత్రాలు లేనందుకు జరిమానా విధించినట్లు స్వయంగా రవాణా శాఖ మంత్రి తెలిపారు. ఇప్పుడు.. సరిగ్గా తనిఖీలు చేపట్టనుందుకు చివరకు ఓ ఉద్యోగిని సస్పెండ్ చేసి  చేతులు దులుపుకున్నారు అధికారులు. సెలవు రోజు స్కూల్ పెట్టి.. పిల్లల్ని బలిగొంది ఓ ప్రైవేట్ స్కూల్. ఈ ఘటన చూస్తుంటే. . మన పిల్లల్ని బడికి పంపించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Show comments