స్నేహితుడి కూతురిపై కన్నేసిన కానిస్టేబుల్.. ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించి

ఇంటికి, భార్యకు దూరంగా ఉంటూ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం రీత్యా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇంతలో అతడికి స్థానికంగా ఉండే ఓ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోనులో మాట్లాడుకునేవారు. కానీ

ఇంటికి, భార్యకు దూరంగా ఉంటూ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం రీత్యా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇంతలో అతడికి స్థానికంగా ఉండే ఓ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోనులో మాట్లాడుకునేవారు. కానీ

శాంతి, భద్రతలను పరిరక్షిస్తూ.. నిత్యం సామాన్యులకు అందుబాటులో ఉంటూ. .అన్యాయం జరిగిందని వచ్చిన బాధితులకు అండగా నిలుస్తోంది పోలీస్ వ్యవస్థ. అహర్నిశలు విశ్రమించిన యోధులు పోలీసులు. అలాంటి పోలీసులను చూడగానే.. రెస్పెక్ట్‌ నెలకొంటుంది. చేతులెత్తి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. కానీ ఈ వ్యవస్థలో కూడా కొంత మంది చీడపురుగుల వల్ల పోలీసులకు చెడ్డ పేరు వస్తుంది. సినిమాల ప్రభావం కొంత వీరిపై నెగిటివిటీ పడేలా చేస్తుంది. అంతే కాకుండా ఖాకీ దుస్తులు ధరించి కీచక పర్వానికి తెరలేపుతున్నారు కొందరు. అమ్మాయిల్ని, మహిళల్ని ట్రాప్ చేస్తూ దారుణాలకు తెగబడుతున్నారు. చివరకు చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా తన కూతురు వయస్సు ఉన్న యువతిపై అత్యాచారానికి ఒడగట్టాడో కానిస్టేబుల్.

స్నేహితుడి కుమార్తెపై కన్నేసిన కానిస్టేబుల్.. మాయ మాటలు చెప్పి ఇంటికి పిలిపించుకుని, మద్యం తాగించి, ఆ మత్తులో అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూరుపేటకు చెందిన తిరునావుక్కరసు (34).. మైలాడుతురై జిల్లా, తరంగంబాడి తాలూకా, పెరంబూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి భార్య, ముగ్గురు కొడుకులు స్వగ్రామంలో ఉంటున్నారు. తిరునావుక్కరసు పెరంబూర్ గార్డ్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. ఇదే కమ్రంలో అక్కడ ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే క్రమంలో స్నేహితుడి 16 ఏళ్ల కుమార్తెతో కూడా చనువు పెరిగింది.

స్నేహం ముసుగులో 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు కానిస్టేబుల్. ఓ రోజు ఇంటికి పిలిచాడు. మాయమాటలు చెప్పి.. తన నివాసానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు బలవంతంగా మద్యం తాగించి.. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంటికి వెళ్లిన బాధితురాలు తండ్రికి విషయం చెప్పింది. హెల్ప్‌లైన్‌లో అందిన ఫిర్యాదుపై మైలాడుతురై జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ సోషల్ వర్కర్ ఆరోగ్య రాజ్, ఒక మహిళా అసిస్టెంట్‌తో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. బాధితురాలు జరిగిందంతా చెప్పింది. అనంతరం పెరంబూర్ పోలీస్ స్టేషన్‌లో ఆరోగ్యరాజ్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి..  తాజాగా తిరునావుక్కరను అరెస్టు చేశారు.ఈ ఘటనతో స్థానికంగా సంచలనం కలిగించింది.

Show comments