టైటిల్: తల్లిదండ్రులకు చెప్పకుండా కూతురు రెండో పెళ్లి.. పరువు కోసం

దేశం అభివృద్ధి చెందుతున్నా కులాల కోసం కోట్లాడుకుంటున్నారు ఇండియన్స్. చదువు, కెరీర్ విషయంలో కాస్ట్ అంటూ అడ్డు చెప్పని పేరెంట్స్.. పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి విలన్లుగా మారిపోతున్నారు.

దేశం అభివృద్ధి చెందుతున్నా కులాల కోసం కోట్లాడుకుంటున్నారు ఇండియన్స్. చదువు, కెరీర్ విషయంలో కాస్ట్ అంటూ అడ్డు చెప్పని పేరెంట్స్.. పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి విలన్లుగా మారిపోతున్నారు.

పిల్లలను ప్రయోజకులను చేసేందుకు ఎంతో కష్టపడుతుంటారు పేరెంట్స్. బిడ్డలు అడిగినది కాదనకుండా ఇస్తుంటారు. ఒంటి మీద ధరించే దుస్తుల దగ్గర నుండి ఏం చదువుకోవాలో కూడా వారి అభిప్రాయాలకు విలువనిస్తారు. కానీ పెళ్లి దగ్గరకి వచ్చే సరికి తమదే పై చేయి కావాలనుకుంటారు. కూతురు లేదా కొడుకు ఆ పెళ్లి ఇష్టమో లేదో తెలుసుకోలేదు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. తాము తెచ్చిన సంబంధాన్నే చేసుకోవాలంటారు. ఇక ఆమె ఎవరినైనా అందులోనూ తమ కులానికి చెందని వ్యక్తిని ఇష్టపడిందా అంతే సంగతులు. కనిపించని పరువు కోసం పాకులాడుతూ.. కడుపున పుట్టిన బిడ్డలను హత్య చేసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా కూతురు మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని తట్టుకోలేక తల్లీదండ్రులే హత్య చేసి.. ఇంటి పక్కే కప్పేట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పద్మనాభ సత్రం, పల్లె పాలెనికి చెందిన వెంకట రమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. కాగా, కూతుళ్లిద్దరికి పెళ్లిళ్లు చేశారు. వీరిలో రెండవ కుమార్తె శ్రావణికి ఆరేళ్ల క్రితం పెళ్లైంది. భర్తతో గొడవలు రావడంతో పుట్టింటికి వచ్చేసింది. ఈ దంపతులకు పద్మనాభ సత్రంలో కూరగాయల దుకాణం ఉండేది. ఆ షాపులోనే ఉంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఈ క్రమంలోనే అల్లూరి మండలానికి చెందిన షేక్ రబ్బానీ భాషా అనే పెయింటర్‌తో శ్రావణికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. చివరకు తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అతడి స్వగ్రామంలో కాపురం పెట్టారు ఈ దంపతులు. అయితే తల్లిదండ్రులు కూతురు మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.

పెళ్లైన వారం తర్వాత ఆమె ఇంటికి వెళ్లి.. తమతో వచ్చేయాలని బతిమాలాడారు. అక్కడ మంచి మాటలు చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత. రబ్బానీని మర్చిపోవాలని, మన కులానికి చెందిన వ్యక్తితో మళ్లీ పెళ్లి చేస్తామంటూ చెప్పారు. ఆమె వినకపోవడంతో గొడ్డును బాదినట్లు బాదారు. ఈ ఘటనలో శ్రావణి మృతి చెందింది. అనంతరం ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుంత తీసి పూడ్చి పెట్టారు. దానిపై కంపతో కవర్ చేశారు. ఆ తర్వాత ఏమీ ఎరుగన్నట్లుగా తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సుమారు 20 రోజులు గడిపోయినప్పటికీ.. శ్రావణి నుండి ఫోన్ రాకపోవడంతో రబ్బానీ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఆమె పుట్టింట్లోనో ఏదో జరిగిందని గ్రహించాడు రబ్బానీ. ఇంటి పెరట్లో దిబ్బలా కనిపించడంతో అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే కూతురు కనిపించడం లేదని కంప్లైట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు తల్లిదండ్రుల్ని అరెస్టు చేసి.. గట్టిగా ప్రశ్నించగా.. నిజం ఒప్పుకున్నారు. తమ కులానికి చెందిన వ్యక్తితో కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుందని, మా పరువు తీసిందని అందుకే చంపేసినట్లు తెలిపారు. ఈ హత్యకు కారకులైన పేరెంట్స్, కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నా కులాల కోసం కోట్లాడుకుంటూ.. పిల్లల్ని పొట్టనపెట్టుకుంటున్న పెద్దల్ని ఏమనాలి..?

Show comments