iDreamPost
android-app
ios-app

అర్థరాత్రి లేడీస్ హాస్టల్లో తనిఖీలు.. 89 మంది మిస్సింగ్! వార్డెన్ ను నిలదీయగా..!

అర్థరాత్రి లేడీస్ హాస్టల్లో తనిఖీలు.. 89 మంది మిస్సింగ్! వార్డెన్ ను నిలదీయగా..!

అది సోమవారం అర్థరాత్రి 12 గంటల సమయం. కొందరు ప్రభుత్వ అధికారులు జిల్లాలో ఉన్న ఓ గర్ల్స్ హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేశారు. 100 మంది విద్యార్థినిలు ఉండాల్సి ఈ హాస్టల్ లో కేవలం 11 మంది అమ్మాయిలే ఉన్నారు. మిగతా 89 మంది స్టూడెంట్స్ కనిపించకపోవడంతో అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇక మిగతా 89 మంది అమ్మాయిలు ఎక్కడా అని హాస్టల్ వార్డెన్ ను నిలదీయగా అతడు నోట్లో నీళ్లు నమిలాడు. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకు ఈ అమ్మాయిలు ఎక్కడున్నారో తెలుసా?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ గోండా జిల్లాలోని పరాస్ పూర్ లో కస్తుర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాల ఉంది. ఇక్కడ దాదాపు 100 మంది అమ్మాయిలు చదువుకుంటూ అక్కడే ఉన్న హాస్టల్ లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం అర్థరాత్రి ఇదే రెసిడెన్షియల్ హాస్టల్ లో అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. అయితే 100 మంది విద్యార్థినులు ఉండాల్సిన హాస్టల్లో కేవలం 11 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించారు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మిగతా 89 అమ్మాయిలు ఎక్కడా అని అధికారులు వార్డెన్ ను నిలదీశారు.

అతడు నోట్లు నీళ్లు నములుతూ సమాధానం చెప్పలేదు. కట్ చేస్తే.. అధికారుల దర్యాప్తులో ఊహించని నిజాలు బయటపడ్డాయి. అసలు విషయం ఏంటంటే? కనిపించకుండా పోయిన మిగతా 89 మంది విద్యార్థినులు వారి వారి ఇళ్లల్లో క్షేమంగా ఉన్నట్లు తేలింది. వారిని ఇంటికి పంపి హాస్టల్ వార్డెన్ ఫేక్ అటెండెన్స్ వేయిస్తున్నారనే అసలు నిజం బయటపడింది. అనంతరం జిల్లా మెజిస్ట్రిట్ ఆదేశాల మేరకు హాస్టల్ వార్డెన్, ఫుల్ టైమ్ టీచర్, వాచ్ మెన్ తో పాటు గేట్ వాచ్ మెన్లపై కేసు నమోదు చేవారు. ఇదే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: తల్లితో కలిసి కుమారుడి గలీజ్ దందా! మైనర్ ను సైతం వదలకుండా..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి