iDreamPost

తల్లితో కలిసి కుమారుడి గలీజ్ దందా! మైనర్ ను సైతం వదలకుండా..!

తల్లితో కలిసి కుమారుడి గలీజ్ దందా! మైనర్ ను సైతం వదలకుండా..!

గౌతమ్ సింగ్, నీతు భాయ్ అనే తల్లీ కొడుకు హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని లోథ బస్తీలో నివాసం ఉంటున్నారు. వీరికి జీ 2 ఇళ్లు. స్కార్పియోతో పాటు మరికొన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. దీంతో వీళ్లు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాగా, వీరి కుటుంబ సభ్యులతో కలిసి గత కొంత కాలంగా ఇదే కాలనీలో ఉంటూ చాలా చోట్ల కిరాణ షాపు దుకాణాలు తెరిచారు. స్థానికంగా ఉన్న ప్రజలు వీరి షాపుల్లో కొనుగోలు చేసేవారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే? కిరాణ షాపు పేరుతో ఈ కుటుంబ సభ్యులు అందులో గంజాయి సరఫరా చేయడం మొదలు పెట్టారు.

అయితే వీళ్ల గంజాయి వ్యాపారం దూల్ పేట్ నుంచి మొదలుకుని ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల వరకు పాకింది. ఒక్కో ప్యాకెట్ ధర రూ.250 గా నిర్ణయించి.., కేజీ రూ.8 వేల చోప్పున వివిధ రకాల పేర్లతో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. కాగా, వీరి నెల సంపాదన దాదాపు రూ.9 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వీరి కుటుంబ సభ్యులతో కలిసి ఆ బస్తీల్లో చాలా షాపుల్లో ఇదే దందాను నడిపిస్తున్నట్లు స్థానికులకు అనుమానం కలిగింది.

ఈ గంజాయి సరఫరా అమ్మకంలో గౌతమ్ సింగ్ అత్త, మామతో పాటు ఓ మైనర్ బాలుడిని సైతం ఈ వ్యాపారంలోకి లాగినట్లు సమాచారం. ఇక స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఇటీవల వీరి షాపులపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇంట్లో రూ.40.3 లక్షల నగదు, 16 బ్యాంకుల్లో 1.53 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుటుంబ సభ్యులు ఈ గలీజ్ దాందాను దాదాపు 4 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లీకుమారుడితో పాటు మరికొంతమంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలస్తుంది. వీళ్లు చేసిన ఈ గలీజ్ దందాను చూసి పోలీసులే బిత్తరపోయారట.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. హోటల్‌ మేనేజర్‌ మృతి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి