SNP
Uttar Pradesh, Etawah District: సొంత చెల్లెళ్లను ఏ మాత్రం కనికరం లేకుండా ఓ అక్క పొట్టనపెట్టుకుంది. అందుకు కారణం ఏంటి? ఆమె అంత దారుణానికి ఎందుకు ఒడిగట్టిందో ఇప్పుడు చూద్దాం..
Uttar Pradesh, Etawah District: సొంత చెల్లెళ్లను ఏ మాత్రం కనికరం లేకుండా ఓ అక్క పొట్టనపెట్టుకుంది. అందుకు కారణం ఏంటి? ఆమె అంత దారుణానికి ఎందుకు ఒడిగట్టిందో ఇప్పుడు చూద్దాం..
SNP
అక్క అంటే అమ్మ తర్వాత అమ్మలాంటిది అంటారు. కానీ, ఈ ఘటన ఆ మాటకే మచ్చతెచ్చేలా ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఇద్దరు చిన్నారి చెల్లెళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ అమ్మాయి.. తనను చూడకూడని స్థితిలో ఉండగా చూశారని వారిని పొట్టనపెట్టుకొంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇతావా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు పిల్లలను ఇంట్లో ఉంచి తల్లిదండ్రులు బయటికి వెళ్లారు. ముగ్గురు అమ్మాయిల్లో అంజలి పెద్దామ్మాయి. ఆమెకు 20 ఏళ్ల ఉంటాయి. ఆమెతో పాటు.. మరో ఇద్దరు బాలికలు ఉన్నారు. ఒకరికి 7 ఏళ్లు, ఇంకో పాపకు 5 ఏళ్లు.
ఈ ముగ్గురి ఇంట్లో ఉంచి సాయంత్రం 5 గంటల సమయంలో తల్లిదండ్రులు బయటికి వెళ్లారు. అయితే.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంజలి ఏకాంతంగా గడిపింది. ఆ సమయంలో ఆమె ఇద్దరు చెల్లెళ్లు ఆమెను చూడకూడని భంగిమలో చూశారు. అదే వారు చేసిన తప్పైపోయింది. తనను ఇలా చూసిన ఇద్దరు చెల్లెళ్లు ఎక్కడ విషయ బయటపెడతారో అని.. దారుణానికి ఒడిగట్టింది అంజలి. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా.. అత్యంత పాశవికంగా గొంతుకోసి చంపేసింది. నేరం బయటపడకుండా.. గొంతుకోసిన ఆయుధాన్ని నీటిగా కడిగి పెట్టేసింది.
అలాగే తల్లిదండ్రులు వచ్చేలోపు రక్తం అంటుకున్న తన బట్టలను కూడా ఉతికేసింది. రాత్రి సమయంలో తల్లిదండ్రుల వచ్చి చూసే సరికి ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో వారి గుండె ఆగినంత పని అయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఓ పదునైన ఆయుధం నీటిగా కడిగి ఉండటాన్ని గుర్తించారు. అలాగే కుటుంబ సభ్యులను ప్రశ్నించే సమయంలో తడబడిన అంజలి.. తర్వాత నిజం ఒప్పేసుకుంది. తన ఇద్దరు చెల్లెళ్లను తానే చంపినట్లు నేరం అంగీకరించింది. దీంతో.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ విషాధ ఘటన ఇతావా జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాను తప్పు చేస్తూ.. దాన్ని అభంశుభం తెలియని చిన్నారులు చూశారంటూ వారిని చంపేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.