Tirupathi Rao
Zomato Is Planning To Buy Paytm Movie Tickets Booking: జొమాటో తమ వినియోగదారుల యూజర్ల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి.. కొత్త డీల్ గురించి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డీల్ సక్సెస్ అయితే మీరు జొమాటోలోనే మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు.
Zomato Is Planning To Buy Paytm Movie Tickets Booking: జొమాటో తమ వినియోగదారుల యూజర్ల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి.. కొత్త డీల్ గురించి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డీల్ సక్సెస్ అయితే మీరు జొమాటోలోనే మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు.
Tirupathi Rao
జొమాటో యూజర్ల డిమాండ్‌ను క్యాప్చర్ చేయడానికి ఫుడ్, గ్రాసరీ, ఎంటర్టైన్‌మెంట్ విభాగాల్లో విస్తరిస్తోంది. పేటిఎం మూవీస్ అలాగే పేటిఎం ఇన్‌సైడర్ ఒకే యూనిట్‌గా మెర్జ్ అవుతున్నాయి. ఈ డీల్ జరిగితే జొమాటో సేల్స్ అమాంతం పెరుగుతాయి. ఎందుకంటే గతంలో జొమాటో ఉబెర్ ఈట్స్ కొనుగోలు చేసింది. 2020లో అలాగే 2021లో బ్లింకిట్ ని కూడా కొనేసింది. అప్పుడు జోమాటో సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఈ రెండింటి తరువాత జొమాటో చేయబోతున్న అతిపెద్ద కొనుగోలు ఇదే. ఈ డీల్ జరిగితే ఇక నుండి దాదాపుగా టికెట్ బుకింగ్స్ అన్నీ కూడా జొమాటోలోనే జరగచ్చు.
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, పేటిఎం సినిమా టికెట్‌లు అలాగే ఈవెంట్స్ కేటగిరిని కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఈ డీల్ వాల్యూ సుమారు రూ. 1,500 కోట్లు అని సమాచారం. పేటిఎం యొక్క ఈ కేటగిరి వాల్యూ రూ. 1,600-1,750 కోట్లు ఉండొచ్చు అని తెలిపారు. ఈ నెల చివరిలో అధికారిక ప్రకటన రావచ్చు. పేటిఎం మూవీస్.. బుక్‌మైషో తర్వాత సినిమా టికెట్‌ల విభాగంలో రెండో స్థానంలో ఉంది. బుక్ మై షో ఫైనాన్షియల్ ఇయర్ 2023 ఆపరేటింగ్ రెవిన్యూ రూ.976 కోట్లుగా ఉంది. అలాగే లాభం రూ.85.72 కోట్లుగా ఉంది. జొమాటో ఇప్పుడు తమ ఆర్థిక సంవత్సరం 2024కి 18.4 మిలియన్ సగటు నెలవారీ ట్రాన్సాక్టింగ్ కస్టమర్లు ఉన్నారు.
ఈ వ్యాపారంలో జొమాటో ఇప్పటికే మార్కెట్ లీడర్‌గా ఉంది. అలాగే 2024 చివరి నాటికి 1,000 డార్క్ స్టోర్‌లును స్థాపించాలని చూస్తోంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ FY23లో రూ.12,226 కోట్ల రికార్డ్ గ్రాస్ చేసింది. 2026 నాటికి లైవ్ ఈవెంట్ విభాగం రూ.14,300 కోట్లకు చేరుతుందని అంచనా ఉంది. పేటిఎం ఫైనాన్షియల్ ఇయర్ 2024 మార్కెటింగ్ సర్వీసెస్ రెవిన్యూ రూ.1,734 కోట్లు. ఇన్‌సైడర్ లైవ్ ఈవెంట్స్ ప్లాట్‌ఫారమ్ రూ.192.7 కోట్లు. పేటిఎం మొత్తం FY24 రెవిన్యూ 83% పేమెంట్స్ ఇంకా ఫైనాన్షియల్ సర్వీసెస్ నుండి వచ్చినవే. పేటిఎం బోర్డు సంస్థను చెల్లింపుల, ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‌లపై దృష్టి సారించాలని కోరుకుంటోంది. ఇప్పుడు ఈ డీల్ గనుక జరిగి టికెట్ బుకింగ్స్ జొమాటోకి వెళ్ళిపోతే దీనికి బదులుగా పేటియం ఏ సర్వీస్ ను తీసుకుని వస్తుందో వేచి చూడాలి.