ఫుడ్ లవర్స్‌కు పండగే.. Zomato ఫుడ్‌ రెస్క్యూ ఫీచర్‌‌తో.. సగం ధరకే ఫుడ్

Zomato Food Rescue: ఫుడ్ లవర్స్ కు పండగలాంటి వార్తను అందించింది జొమాటో. సగం ధరకే ఫుడ్ కొనుగోలు చేసేలా సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

Zomato Food Rescue: ఫుడ్ లవర్స్ కు పండగలాంటి వార్తను అందించింది జొమాటో. సగం ధరకే ఫుడ్ కొనుగోలు చేసేలా సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చాక నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే వచ్చేస్తోంది. జొమాటో, స్విగ్గీ సంస్థలు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో దూసుకెళ్తున్నాయి. ఇప్పుడంతా బిజీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్లో వంట చేసుకోవడానికి టైమ్ లేని వారు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఇంటికే ఫుడ్ వచ్చేస్తుండడంతో ఈ యాప్స్ కు డిమాండ్ పెరిగింది. రోజు వేల కొద్ది ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాయి ఆయా సంస్థలు. అయితే కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో మార్కెట్ లో నిలదొక్కుకునేందుకు రకరకాల ఆఫర్స్ ను తీసుకొస్తున్నాయి. కొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టి కస్టమర్లకు లాభం చేకూరేలా చేస్తున్నాయి. డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆట్రాక్ట్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది. ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఫుడ్ రెస్క్యూ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ యూజర్లకు మనీ సేవ్ అయ్యేలా చేస్తుంది. ఫుడ్ రెస్క్యూ ఫీచర్ తో జొమాటో తన కస్టమర్లకు సగం ధరకే ఫుడ్ కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. కస్టమర్లు క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను డిస్కౌంట్ ధరకు ఇతరులు కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది జొమాటో. క్యాన్సిల్ అయిన ఆర్డర్ ను నిమిషాల వ్యవధిలో సగం ధరకే ఇతర కస్టమర్లు పొందొచ్చు. ఉదాహరణకు ఓ కస్టమర్ ఆర్డర్ ను క్యాన్సిల్ చేసిన తర్వాత, ఆ ఆర్డర్ ను తీసుకెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్టమర్లకు అది పాప్ అప్ అవుతుంది.

ఫుడ్ అవసరం ఉన్న కస్టమర్లు తక్కువ ధరకే తీసుకొవచ్చు. క్యాన్సిల్ ఆర్డర్ ను తీసుకున్న కస్టమర్ చెల్లించే మొత్తాన్ని క్యాన్సిల్ చేసిన కస్టమర్ కు, రెస్టారెంట్ పార్ట్ నర్ కు జొమాటో సంస్థ చెల్లిస్తుంది. కాగా ఐస్ క్రీం, షేక్స్, స్మూతీలు వంటి వాటికి ఈ ఆఫర్ వర్తించదు. అయితే జొమాటోలో ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ను తీసుకురావడానికి గల కారణం ఆహార వృథాను అరికట్టడానికి అని జొమాటో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ తెలిపారు. ఎక్స్ వేదికగా ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన వివరాలను ఆయన ప్రకటించారు.

నో-రిఫండ్ విధానం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల నెలకు 4 లక్షల కంటే ఎక్కువ ఆర్డర్లను వినియోగదారులు క్యాన్సిల్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చామన్నారు. క్యాన్సిలేషన్ వల్ల ఫుడ్ వేస్టేజీ ఎక్కువగా అవుతుంది. ఫుడ్‌ వేస్టేజీని అరికట్టడానికి కూడా ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగపడుతుందని గోయల్‌ అభిప్రాయపడ్డారు. జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం అటు కస్టమర్లకు, ఇటు సంస్థకు లాభదాయకండా ఉండనున్నది. మరి జొమాటోలో సగం ధరకే ఫుడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments