Zomato యూజర్లకు గుడ్ న్యూస్.. ఫుడ్ లవర్స్ కోరుకున్న ఫీచర్ అందుబాటులోకి

Zomato: జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్. ఫుడ్ లవర్స్ కోరుకునే ఫీచర్ ను తీసుకొచ్చింది. దీనితో ఫుడ్ లవర్స్ కు ఆ సమస్య తీరనున్నది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే?

Zomato: జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్. ఫుడ్ లవర్స్ కోరుకునే ఫీచర్ ను తీసుకొచ్చింది. దీనితో ఫుడ్ లవర్స్ కు ఆ సమస్య తీరనున్నది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే?

ఒకప్పుడు ఇష్టమైన ఫుడ్ కోసం హోటల్స్, రెస్టారెంట్స్ కి వెళ్లేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఏ ఫుడ్ కావాలన్నా ఆన్ లైన్ లో బుక్ చేసుకుని ఇంటికే తెప్పించుకుంటున్నారు. కూర్చున్న చోటుకే ఫుడ్ డెలివరీ అవుతుండడంతో ఆన్ లైన్ ఫుడ్ యాప్స్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. స్వీగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థలు కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్నాయి. ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు లక్షల సంఖ్యలో ఫుడ్ డెలివరీలను చేస్తున్నాయి. కాగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో రారాజుగా కొనసాగుతున్న జొమాటో తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఫుడ్ లవర్స్ కు వరంగా మారనుంది.

జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఫుడ్ లవర్స్ కు తమకిష్టమైన ఫుడ్ ను ఆర్డర్ పెట్టుకుంటున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు జొమాటో ఆఫర్స్ ను ప్రకటిస్తూ ఉంటుంది. యూజర్లకు క్వాలిటీ ఫుడ్ అందించేందుకు జొమాటో కృషి చేస్తూ ఉంటుంది. అయితే యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలో ఫుడ్ లవర్స్ కోరుకునే ఫుడ్ ఆర్డర్ హిస్టరీని తొలగించే ఫీచర్ ను తీసుకొచ్చినట్లు జొమాటో ప్రకటించింది. దీని సాయంతో యూజర్లు తమ ఆర్డర్ హిస్టరీని డిలిట్ చేసుకోవచ్చు.

యూజర్లు తరచుగా ఆర్డర్లు పెట్టుకుంటుంటారు. మిడ్ నైట్ కూడా ఆర్డర్స్ పెట్టుకుంటుంటారు. అయితే ఈ హిస్టరీ అంతా డిలీట్ చేసుకునే వెసులుబాటు ఉంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. అయితే అర్థరాత్రి ఆర్డర్ పెట్టుకని తన భార్యకు దిరికిపోయారు కరణ్ సింగ్ అనే యూజర్. దీంతో ఆ యూజర్ ఎక్స్ లో ఓ పోస్టు చేశాడు. ఇకపై మిడ్ నైట్ ఆర్డర్ పెట్టలేను. నా భార్య ఆర్డర్ హిస్టరీ చెక్ చేయడం వల్ల నేను దొరికిపోయాను. ఈ ఆర్డర్ హిస్టరీని తొలగించేలా చేయండి అని ట్వీట్ చేశాడు.

ఈ క్రమంలోనే కస్టమర్ల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని తాము ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని గోయల్ ప్రతి ఒక్కరికి సూచించారు. ట్విట్టర్లో గోయల్ వినియోగదారుని రిక్వెస్ట్ పై స్పందిస్తూ.. మీరు ఇప్పుడు జొమాటోలో ఆర్డర్ హిస్టరీ నుంచి మీ ఆర్డర్‌లను తొలగించవచ్చు అని తెలిపారు. వినియోగదారులు నేరుగా ‘యువర్ ఆర్డర్స్’ ట్యాబ్‌కు వెళ్లడం ద్వారా ఆర్డర్‌లను తొలగించవచ్చని జొమాటో పేర్కొంది.

Show comments