ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? 59 వేలకే EV.. త్వరపడండి

మీరు ఈ మధ్యకాలంలో కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. 59 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. త్వరపడండి.

మీరు ఈ మధ్యకాలంలో కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. 59 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. త్వరపడండి.

రానురాను ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువైపోతుంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త టెక్నాజీతో, అద్భుతమైన ఫీచర్లతో ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఈవీ సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు లభిస్తుండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. మరి మీరు ఈ మధ్యకాలంలో కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరకే బెస్ట్ స్కూటర్ అందుబాటులో ఉంది. జీలియో ఈబైక్స్ కొత్త సిరీస్ స్కూటర్లను లాంచ్ చేసింది.

జీలియో కంపెనీ గ్రేసీ సిరీస్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చింది. గ్రేసీ ఐ మోడల్, గ్రేసీ మోడల్ ప్రో పేరుతో వీటిని కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ. 59,273 నుండి రూ. 83,073 ఎక్స్-షోరూమ్ మధ్య ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. గ్రేసీ ఐ మోడల్ సింగిల్ ఛార్జ్ తో 65 కి.మీల వరకు ప్రయాణించొచ్చు. గ్రేసీ మోడల్ ప్రో సింగిల్ ఛార్జ్ తో 80 కి.మీల వరకు ప్రయాణించొచ్చు. గ్రేసీ ఐ ఈ-స్కూటర్ 60/72వీ బీఎల్డీసీ మోటారును కలిగి ఉంది. 60 కిలోల బరువు, 150 కిలోల లోడింగ్ సామర్థ్యంతో వస్తుంది.1.92కేడబ్య్లూహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీని అమర్చారు.

గ్రేసీ మోడల్ ప్రో స్కూటర్ 60/72వీ బీఎల్డీసీ మోటారును కలిగి ఉంది. 70 కిలోల బరువు, 150 కిలోల లోడింగ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ స్కూటర్ లో 2.24కేడబ్య్లూహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీని అమర్చారు. ఈ రెండు స్కూటర్లలో కూడా ముందు డిస్క్ బ్రేక్‌లు, వెనుక డ్రమ్ బ్రేక్‌లను అందించారు. జీలియో ఈబైక్స్ లో యాంటీ-థెఫ్ట్ అలారం, రివర్స్ గేర్ ఫీచర్, ఆటో రిపేర్ స్విచ్, డిజిటల్ డిస్‌ప్లే, ఉదారంగా బూట్ స్పేస్ వంటి లేటెస్ట్ ఫీచర్లను అందించారు. తక్కువ ధరలోనే ఈవీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదే బెస్ట్ స్కూటీ అంటున్నారు మార్కెట్ నిపుణులు.

Show comments