పోస్టాఫీస్ సూపర్ స్కీం.. నెలకు రూ. 1500 పెట్టుబడితో.. చేతికి రూ. 5 లక్షలు..

Public Provident Fund: మీరు మంచి రాబడినచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి చేతికి రూ. 5 లక్షలు పొందొచ్చు.

Public Provident Fund: మీరు మంచి రాబడినచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి చేతికి రూ. 5 లక్షలు పొందొచ్చు.

సంపాదించిన సొమ్ములో ఎంతో కొంత పొదుపు చేసుకుంటే భవిష్యత్ లో ఆర్థిక అవసరాలకు లోటుండదు. ఎక్కువ సంపాదించేవారికన్నా.. తక్కువ పొదుపు చేసే వారికే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపదలు ఎప్పుడు చుట్టుముడతాయో తెలీదు.. కాబట్టి ఖర్చులను తగ్గించుకుని పొదుపు మంత్రం పాటిస్తే మేలు. అయితే పొదుపును మంచి ఇన్వెస్ట్ మెంట్ గా మార్చుకుంటే అధిక రాబడులు అందుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టి డబ్బును రెట్టింపు చేసుకోవాలనుకుంటే అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంద. కానీ రిస్క్ ఎక్కువ. లాభాల సంగతి దేవుడెరుగు ఉన్న డబ్బు పోయినా పోవచ్చు. కాబట్టి రిస్క్ లేకుండా భద్రతతో కూడిన రిటర్న్స్ పొందాలంటే ప్రభుత్వ పథకాలు మేలు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీస్ లో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ పథకం. ఇందులో నెలకు రూ. 1500 కడితే.. మెచ్యూరిటీ సమయానికి చేతికి రూ. 5 లక్షలు వస్తాయి.

దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ లను తీసుకొస్తున్నది. పోస్టాఫీస్ ద్వారా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అమలు చేస్తున్నది. ఈ పోస్టాఫీస్ పథకాల్లో అధిక వడ్డీని పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడిని అందుకోవచ్చు. పెట్టుబడిపై 7.1 శాతం వడ్డీని అందుకోవచ్చు. ఈ పథకంలో 15సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా 5 సంవత్సరాల చొప్పున పెంచుకుంటూ పోవొచ్చు. ఎవరైనా వ్యక్తి గానీ.. మైనర్ పేరిట గానీ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో ఏటా కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడిపెట్టొచ్చు. 15 ఏళ్లలో ఏదైనా ఒక సంవత్సరం కనీసం రూ. 500 ఇన్వెస్ట్ చేయకపోతే అకౌంట్ నిలిచిపోతుంది. బ్యాంకుతో పాటు, మీరు పోస్టాఫీసులో కూడా పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ స్కీమ్‌పై ఇతర పన్ను ప్రయోజనాలు, గ్యారెంటీడ్ రిటర్న్స్ వస్తున్నాయి.

పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ పథకంలో 5 లక్షలు పొందాలంటే నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మీ ఇన్వెస్ట్ మెంట్ ఏడాదికి రూ.18000 అవుతుంది. ఇలా 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం రూ. 2,70,000 అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటుతో మీ పెట్టుబడిపై రూ. 218185 ఆదాయం సమకూరుతుంది. మెచ్యూరిటీ సమయానికి మీ పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని మొత్తం రూ. 488185 అందుతుంది. అంటే మీకు దాదాపుగా 5 లక్షలు చేతికి వస్తాయి. మీరు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని కోరుకుంటే ఈ పథకాన్ని మరో ఐదేళ్లు పొడగించుకోవచ్చు.

Show comments