సిరులు కురిపించే స్కీమ్.. రోజుకు 333 పొదుపు చేస్తే చాలు.. చేతికి 55 లక్షలు

మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. రోజుకు 333 పొదుపు చేస్తే చాలు మెచ్యూరిటీ కాలానికి చేతికి 55 లక్షలు అందుకోవచ్చు.

మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. రోజుకు 333 పొదుపు చేస్తే చాలు మెచ్యూరిటీ కాలానికి చేతికి 55 లక్షలు అందుకోవచ్చు.

ప్రస్తుత రోజుల్లో ఏ పని జరగాలన్నా డబ్బు కావాల్సిందే. జీవితంలో డబ్బే ముఖ్యమని అంతా భావిస్తున్నారు. సంపాదించిన సంపాదనలో కొంత పొదుపు చేసి అధిక లాభాలు అందుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం మంచి రాబడులను అందించే మార్గాలు ఏంటని ఆరా తీస్తున్నారు. అయితే ప్రైవేట్ సెక్టార్ కంటే ప్రభుత్వానికి చెందిన పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి అందుకోవడంతో పాటు సురక్షితంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులు భారం కాకూడదని కేంద్రం ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో రోజులకు 333 పొదుపు చేస్తే చాలు మెచ్యూరిటీ సమయానికి 55 లక్షలు అందుకోవచ్చు. ఎలా అంటే?

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం, బాలికల కోసం సూపర్ స్కీమ్స్ ను ప్రవేశపెట్టింది. ఆడపిల్లల కోసం 2015లో సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఆడపిల్లల పైచదువులు, వివాహం కోసం పెద్ద మొత్తంలో డబ్బును సమకూర్చేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకంలో పెట్టుబడిపెడితే అధిక వడ్డీని అందుకోవచ్చు. ఈ పథకంలో వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. ఈ స్కీమ్ లో పాప పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పాపకు 10 సంవత్సరాల వయసు వచ్చే లోపే ఈ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది.

ఇందులో 15 సంవత్సరాలు పొదుపు చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 21 సంవత్సరాలకు ఖాతా మెచ్యూరిటీ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో సంవత్సరానికి రూ. 250 కట్టొచ్చు. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. పథకం మెచ్యూరిటీ కంటే ముందుగానే 18 ఏళ్లు నిండాక చదువుకయ్యే ఖర్చుల కోసం 50 శాతం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినాహాయింపు పొందొచ్చు.

55 లక్షలు పొందాలంటే:

సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరిన వారు నెలకు రూ. 10 వేల చొప్పున డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి రూ. 55,42,062 వస్తాయి. నెలకు 10 వేలు అంటే రోజుకు 333 రూపాయలు డిపాజిట్ చేస్తే ఏడాదికి 1,20,000 అవుతుంది. వరుసగా 15 సంవత్సరాలు కడితే మీ మొత్తం పెట్టుబడి రూ. 18 లక్షలుగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 8.20 శాతం వడ్డీ ప్రకారం చేతికి వడ్డీనే రూ. 37,42,062 లక్షలు అందుతుంది. పథకం మెచ్యూరిటీ సమయానికి పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని మీ చేతికి రూ. 55,42,062 అందుతాయి. ఈ మొత్తం డబ్బుతో ఏ చింతా లేకుండా మీ కూతురును పై చదువులు చదివించుకోవచ్చు. లేదా పెళ్ళి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.ల

Show comments