ఈ స్కీమ్‌లో ఒకసారి కడితే చాలు.. నెలకు 10వేలు పొందొచ్చు.. ఎలా అంటే?

మీరు మంచి రాబడినిచ్చే పథకాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రతి నెల ఆదాయాన్ని కోరుకుంటున్నారా? అయితే ఎల్ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్ ఉంది. ఈ పథకం ద్వారా నెలకు 10 వేలు పొందొచ్చు.

మీరు మంచి రాబడినిచ్చే పథకాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రతి నెల ఆదాయాన్ని కోరుకుంటున్నారా? అయితే ఎల్ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్ ఉంది. ఈ పథకం ద్వారా నెలకు 10 వేలు పొందొచ్చు.

జీవితం అన్నాక కష్టాలు కామన్. కష్టాలను దరిచేరనీయకుండా చేసేది ఒక్క డబ్బు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరు డబ్బు సంపాదనకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇదే సమయంలో మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులకు వచ్చే జీతం సరిపోని వారు నెల నెలా ఆదాయం ఉంటే బాగుండని భావిస్తున్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఆదాయ మార్గాలు ఏంటి? ప్రతి నెల ఆదాయాన్నిచ్చే పథకాలు ఏమున్నాయని ఆరా తీస్తున్నారు ఇలాంటి వారికి గుడ్ న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకంలో ఒకసార కడితే చాలు నెలకు 10 వేలు అందుకోవచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ప్రజల కోసం సూపర్ స్కీమ్స్ ను తీసుకొస్తున్నది. వాటిల్లో ఒకటి ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీ. ఈ పథకంలో ఒక్కసారి కడితే చాలు ప్రతి నెల డబ్బులు పొందొచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితమైన రాబడిని అందుకోవచ్చు. నెల నెల డబ్బులతో పాటు బీమా కవరేజ్ కూడా లభిస్తుంది. ఈ పాలసీలో పలు రకాల యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు యాన్యుటీ డిఫర్డ్ ఆప్షన్ ఎంచుకునే వీలుంది. అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఎప్పటి నుంచి డబ్బులు పొందాలి అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు. 30 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పాలసీలో చేరొచ్చు.

ఈ పాలసీలో కనీసం రూ.1.5 లక్షలు చెల్లించి మీరు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి లేదు. మీరు డిపాజిట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. డిఫర్డ్ యాన్యూటీలోనూ రెండు ఆప్షన్లు ఉంటాయి. సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అనేవి ఉంటాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు ప్రతీ నెల డబ్బులు పొందొచ్చు. ఇక ఈ పథకంలో 35 ఏళ్ల వయసులో రూ.10 లక్షలు పెట్టి పాలసీ కొనుగోలు చేశారనుకుందాం. సింగిల్ లైఫ్ ఆప్షన్ ఎంచుకున్నారు. డిఫర్‌మెంట్ పీరియడ్ 10 ఏళ్లు. ఇప్పుడు వీరికి ఏడాదికి రూ.1.2 లక్షలు అందుతాయి. అంటే ప్రతి నెల రూ.10 వేలు చేతికి వస్తాయి.

Show comments