P Venkatesh
Postal Payment Bank: మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ ద్వారా రోజుకు రూ. 2 పొదుపుతో ఏకంగా రూ. 15 లక్షలు పొందే ఛాన్స్ ఉంది.
Postal Payment Bank: మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ ద్వారా రోజుకు రూ. 2 పొదుపుతో ఏకంగా రూ. 15 లక్షలు పొందే ఛాన్స్ ఉంది.
P Venkatesh
కుటుంబం అంతా ఇంటి పెద్ద సంపాదనపై ఆధారపడి జీవిస్తుంది. అతనికి అనుకోని ఆపద సంభవిస్తే మాత్రం ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డునపడే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయాల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలంటే ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకోవడం బెటర్. ఆపద సమయంలో బీమా సొమ్ము కుటుంబానికి అండగా నిలుస్తుంది. అప్పుల ఊబిలోంచి బయటపడేస్తుంది. కాగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు బీమా పాలసీలను అందిస్తున్నాయి. అదిరిపోయే ప్రయోజనాలతో ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొస్తున్నాయి. పోస్టల్ డిపార్ట్ మెంట్ కూడా దేశ ప్రజల కోసం సేవింగ్ స్కీమ్స్ తో పాటు ఇన్సూరెన్స్ పాలసీలను కూడా అమలు చేస్తున్నది. ఇటీవల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది భారతీయ పోస్ట్ పేమెంట్ బ్యాంక్.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాలైన హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ స్కీమ్స్ లాంచ్ చేసింది. ఈ పథకాల కాల వ్యవధి ఒక సంవత్సరం. 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు వారు హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పాలసీల్లో చేరొచ్చు. తక్కువ ప్రీమియంతోనే భారీ ప్రయోజనాలను అందుకోవచ్చు. ప్రమాదాల భారిన పడినప్పుడు వైద్య ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి. బీమా పాలసీలు ఉన్నట్లైతే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఏడాదికి రూ.755 కడితే చాలు రూ.15 లక్షలు పొందొచ్చు. అంటే రోజుకు రూ. 2 పొదుపు చేస్తే చాలు రూ. 15 లక్షల బీమా సొమ్ము మీ సొంతం చేసుకోవచ్చు.
పోస్టాఫీసు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా రూ. 15 లక్షల బీమా పొందాలంటే.. సంవత్సరానికి రూ. 755 చెల్లించాలి. బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే అతడి కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లిస్తారు. అలాగే శాశ్వత అంగ వైకల్యం ఏర్పడినా రూ.15 లక్షలు అందుతాయి. పాలసీదారు మరణిస్తే పిల్లల చదువులకు రూ.1 లక్ష, పిల్లల పెళ్లి కోసం మరో రూ.1 లక్ష అదనంగా చెల్లిస్తుంది పోస్టల్ శాఖ. పాలసీదారు బతికి ఉంటే వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు ఇస్తారు. ఆసుపత్రిలో సాధారణ వైద్యానికి రోజుకు రూ.1000, ఐసీయూలో చేరితే రోజుకు రూ.2 వేలు ఇస్తారు. చేయి లేదా కాలు విరిగినట్లయితే రూ.25 వేలు అందుతాయి. ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ లో మరో పాలసీ ఉంది.
ఇందులో సంవత్సరానికి రూ.555 చెల్లించాలి. ఈ పాలసీ ద్వారా రూ. 10 లక్షలు వస్తాయి. ప్రమాదవశాత్తు మరణించినా లేదా ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం ఏర్పడినా కుటుంబానికి 100 శాతం రక్షణ కూడా అందించబడుతుంది. చివరకు దహన సంస్కారాల ఖర్చు దాదాపు రూ. 5,000 పొందవచ్చు. అలాగే మృతుల పిల్లల చదువు కోసం రూ. 50,000 అందుబాటులో ఉంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందించే మరో పాలసీలో సంవత్సరానికి రూ. 355 చెల్లిస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ ద్వారా రూ. 5 లక్షల బీమా లభిస్తుంది. ఈ పాలసీ ద్వారా వ్యక్తి ప్రమాదంభారిన పడినప్పుడు.. మరణించినా, శాశ్వత అంగ వైకల్యం పొందినా 100 శాతం సమ్ ఇన్‌ష్యూర్డ్ అందిస్తారు.
అలాగే పిల్లల పెళ్లి కోసం రూ.50 వేల వరకు చెల్లిస్తారు. అలాగే ఎముకలు విరిగినట్లయితే రూ.25 వేలు ఇస్తారు. హెల్త్ ప్లస్ రెండో ఆప్షన్ లో ఏడాదికి రూ.555 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో రూ.10 లక్షల బీమా పొందొచ్చు. పాలసీదారు మరణించినా, శాశ్వత అంగవైకల్యం చెందినా 100 శాతం చెల్లిస్తారు. ఎముకలు విరిగినప్పుడు రూ.25 వేలు ఇస్తారు. అంత్య క్రియల కోసం రూ.5 వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. పిల్లల చదువు కోసం రూ.50 వేల వరకు పొందవచ్చు. పోస్టల్ బ్యాంకులో ఖాతా ఉన్నవారు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ ద్వారా ఈ పాలసీలను తీసుకోవచ్చు.