UPI payments: యూజర్లకు గుడ్ న్యూస్.. Bank ఖాతా లేకున్నా UPI చెల్లింపులు.. ఎలా అంటే?

యూజర్లకు గుడ్ న్యూస్.. Bank ఖాతా లేకున్నా UPI చెల్లింపులు.. ఎలా అంటే?

UPI payments: యూజర్లకు గుడ్ న్యూస్. ఇకపై బ్యాంక్ ఖాతా లేకున్నా ఆన్ లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు. త్వరలోనే కొత్త సిస్టం అందుబాాటులోకి రానున్నది. ఇది ఎలా సాధ్యమంటే?

UPI payments: యూజర్లకు గుడ్ న్యూస్. ఇకపై బ్యాంక్ ఖాతా లేకున్నా ఆన్ లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు. త్వరలోనే కొత్త సిస్టం అందుబాాటులోకి రానున్నది. ఇది ఎలా సాధ్యమంటే?

ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్ సిస్టం అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల విధానమే మారిపోయింది. నిత్యం వేలాది ట్రాన్సాక్షన్స్ ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయి. కిరాణా షాపు నుంచి మొదలుకుని షాపింగ్ మాల్స్ వరకు అన్ని రకాల పేమెంట్స్ డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్లు మాత్రమే యూపీఐతో లింక్ అయి పేమెంట్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇకపై బ్యాంక్ ఖాతా లేకున్నా కూడా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. త్వరలో కొత్త సిస్టం అందుబాటులోకి రానున్నది. ఖాతా లేకున్నా ఆన్ లైన్ పేమెంట్ ఎలా సాధ్యమంటే?

బ్యాంక్ ఖాతా ఉన్నవారు మొబైల్ నెంబర్ తో లింక్ చేసుకుని యూపీఐ సేవలను వినియోగించుకునే వీలుంది. గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం ఇలా ఏ యూపీఐ సర్వీస్‌ను వాడాలన్నా.. బ్యాంక్‌ ఖాతా తప్పనిసరి. ఇకపై బ్యాంక్ అకౌంట్ లేకున్నా పేమెంట్ చేసేలా నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ).. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సర్వీస్‌ను అప్‌గ్రేడ్‌ చేసే పనిలో ఉన్నది. దీనిలో భాగంగానే కొత్తగా డెలిగేటెడ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను తీసుకొస్తున్నది. యూపీఐ అకౌంట్‌ ఉన్న వ్యక్తి అనుమతితో వారి కుటుంబ సభ్యులు, ఇతరులు బ్యాంక్‌ ఖాతా లేకున్నా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చేసుకునే అవకాశాన్ని ఈ కొత్త సిస్టమ్‌ కల్పించనున్నది.

డెలిగేటెడ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా.. కుటుంబంలో ఒక వ్యక్తి యూజ్ చేస్తున్న యూపీఐ అకౌంట్ తో మిగతా కుటుంబ సభ్యులు కూడా మొబైల్ నెంబర్ లింక్ చేసుకుని అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ కలిగిన వారికి మాత్రమే ఉన్నది. క్రెడిట్‌ కార్డులు, ఇతర ఆర్థిక సాధనాలకు ఇది వర్తించదు. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన విధివిధానాలను ఎన్‌పీసీఐ త్వరలో ప్రకటించనున్నది. ఈ కొత్త సిస్టంతో బ్యాంక్ ఖాతా లేనివారికి ఆన్ లైన్ చెల్లింపులు చేసుకునే సౌకర్యం ఏర్పడనున్నది.

Show comments