Dharani
Union Budget 2024-1 Month Wage, New Employees: ఉద్యోగులకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారీ శుభవార్త చెప్పారు. వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..
Union Budget 2024-1 Month Wage, New Employees: ఉద్యోగులకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారీ శుభవార్త చెప్పారు. వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..
Dharani
బడ్జెట్‌లో ఉద్యోగులుకు నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి 15 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మొత్తాన్ని వారి పీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. దీనిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. అలానే తమ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తొలి సారి ఉద్యోగంలో చేరిన వారికి ఊహించని సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. వారికి నెల జీతాన్ని పీఎఫ్‌లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇది అందరికి వర్తించదు. నెలకు గరిష్టంగా లక్షలోపు జీతం ఉన్న వారే ఈ స్కీమ్‌కు అర్హులు అని తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 2.1 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని.. నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతేకాక ఉద్యోగంలో చేరిన నాలుగేళ్ల వరకు అటు ఉద్యోగితో పాటు కంపెనీకి కూడా లబ్ధి చేకూరేలా కీలక ప్రకటన చేశారు.
ఉపాధి కల్పనను ప్రోత్సాహించేందుకు కొత్త ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ.. ఐదు పథకాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలానే నిరుద్యోగుల కోసం ప్రధానమంత్రి ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో (ఈపీఎఫ్‌ఓ) నమోదు ఆధారంగా వీటిని అమలు చేస్తామని స్పష్టం చేసింది.
స్కీమ్-ఏ: ఈపీఎఫ్‌వోలో నమోదైన కొత్త ఉద్యోగులకు ఒక నెల జీతం అనగా రూ.15000 వరకు.. మూడు విడతల్లో చెల్లిస్తారు
స్కీమ్-బీ: మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగులకు, యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. మొదటి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్ ఆధారంగా చెల్లింపులు చేస్తారు
స్కీమ్-సీ: అధికంగా ఉద్యోగులను చేర్చుకున్న యాజమాన్యాలకు రెండేళ్లపాటు రూ.3000 వరకు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్ రీయింబర్స్‌మెంట్ వర్తింప చేస్తారు.
ఉద్యోగులు, యువతపైనే ప్రధానంగా దృష్టి సారించిన కేంద్రం.. 5 కోట్ల మంది యువతకు ఉపాదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వారికి ఉపాధి కోసం 1000 ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ. 2 లక్షల కోట్ల వరకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈసారి 9 ప్రధానాంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, మౌలిక రంగం, ఇంధన భద్రత, ఆవిష్కరణలు, సంస్కరణలు, వ్యవసాయ రంగంలో ఉత్పాదకతపై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు.