పక్షి లోగోకు ట్విట్టర్ గుడ్ బై! దాని ప్లేసులో కొత్తగా ఏ సింబల్ అంటే..?

  • Author singhj Published - 08:46 AM, Mon - 24 July 23
  • Author singhj Published - 08:46 AM, Mon - 24 July 23
పక్షి లోగోకు ట్విట్టర్ గుడ్ బై! దాని ప్లేసులో కొత్తగా ఏ సింబల్ అంటే..?

దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ ట్విట్టర్​ గత కొన్నాళ్లుగా బాగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ కంపెనీని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఏదో ఒక విషయం ద్వారా న్యూస్​లో ట్విట్టర్​ పేరు వినిపిస్తూనే ఉంది. మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్​ తొలగింపు, భారీ స్థాయిలో ఉద్యోగుల తీసివేతతో పాటు బ్లూ టిక్​కు డబ్బులు లాంటి విషయాల ద్వారా ట్విట్టర్ బ్రాండింగ్​పై దెబ్బపడుతూ వచ్చింది. అయితే మస్క్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ లోగో నుంచి పక్షి మాయమైపోతుందని ఆయన తెలిపారు.

కొన్నేళ్లుగా ట్విట్టర్​కు పిట్ట లోగో మెయిన్ సింబల్​గా ఉన్న విషయం తెలిసిందే. లోగో మార్పుకు సంబంధించిన విషయాన్ని ఆదివారం ట్విట్టర్​లో ఎలాన్ మస్క్ వెల్లడించారు. సరికొత్తగా ఏర్పాటు చేసిన ‘ఎక్స్​ కార్ప్’ అనే కంపెనీలో ట్విట్టర్​ను విలీనం చేస్తున్నట్లు కొన్నేళ్ల కింద ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ట్విట్టర్​ బ్రాండ్​కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు మేం వీడ్కోలు పలకనున్నాం. ఈ నైట్ పోస్ట్ చేసిన ‘ఎక్స్’ లోగో బాగుంటే.. రేపటి నుంచి వరల్డ్​వైడ్​గా అదే లైవ్​లోకి వస్తుంది’ అని మస్క్ ట్వీట్ చేశారు. ట్విట్టర్​ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇదే అతిపెద్ద మార్పుగా నిలవనుందని చెప్పొచ్చు.

ఎలాన్ మస్క్​కు ‘ఎక్స్’ అనే అక్షరం అంటే చాలా ఇష్టం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ట్విట్టర్​ సీఈవోగా లిండా యాకరినో బాధ్యతలు తీసుకున్న టైమ్​లోనూ కంపెనీని ఎవ్రీ థింగ్ యాప్ ఎక్స్​గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇకపోతే, ట్విట్టర్​లోని అన్​వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి డైరెక్ట్ మెసేజెస్​ పంపడాన్ని పరిమితం చేస్తున్నట్లు శనివారం మస్క్ ప్రకటించారు. డైరెక్ట్ మెసేజ్​ల స్పామ్​ను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అన్​వైరిఫైడ్ అకౌంట్స్ నుంచి భవిష్యత్తులో పరిమిత సంఖ్యలోనే డైరెక్ట్​ మెసేజ్​లు చేయగలరని ఆయన స్పష్టం చేశారు. ట్విట్టర్​ లోగో నుంచి పిట్టను తీసేయడంపై మీరేం అనుకుంటున్నారు అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments