శ్రావణ మాసంలో భారంగా బంగారం ధరలు! మరోసారి మహిళలకి షాక్ ఇస్తూ!

Gold And Silver Price: బంగారం ప్రియులను గోల్డ్ ధరలు కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు తగ్గిన పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. నేడు తులం ఎంత ఉందంటే?

Gold And Silver Price: బంగారం ప్రియులను గోల్డ్ ధరలు కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు తగ్గిన పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. నేడు తులం ఎంత ఉందంటే?

కేంద్రం 2024-25 బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకం తగ్గింపుతో ఒక్కసారిగా గోల్డ్ ధరలు దిగివచ్చాయి. అంతకు ముందు అధిక ధరల కారణంగా పసిడి కొనేందుకు, దానిపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆలోచించిన వారు మళ్లీ కొనుగోళ్ల బాటపట్టారు. బడ్జెట్ అనంతరం ఏకంగా ఐదు వేలకు పైగానే గోల్డ్ ధరలు దిగివచ్చాయి. దీంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇది మూడు రోజుల మురిపెంగానే మిగిలిపోయింది. మళ్లీ బంగారం, వెడి ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గిన బంగారం వెండి ధరల్లో ఇంతలోనే అంత మార్పు కనిపిస్తుంది. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

శ్రావణ మాసం ప్రారంభం అవడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బంగారం కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీంతో గోల్డ్ షాపులు కస్టమర్ల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసంలో వినియోగదారుల నుండి కొనుగోళ్లు అధికంగా ఉంటాయి కాబట్టి.. ఇప్పట్లో ఈ ధరల పెరుగుదల.. తగ్గడం అసాధ్యంలా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గగా నేడు మళ్లీ పెరిగాయి.

నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల తులం బంగారంపై 10 రూపాయలు పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,660కు చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.71,630 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, చెన్నై, ముంబయిలో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,780కి వద్ద అమ్ముడవుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,810కు ట్రేడ్ అవుతుంది.

వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. నేడు వెండి ధరలు పెరిగాయి. కిలో సిల్వర్ పై రూ. 100 పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 88,600గా ఉంది. విజయవాడ, చెన్నై, మధురై, కేరళలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. హస్తినలో కిలో సిల్వర్ ధర రూ. 83,600 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు బంగారం, వెండి ధరల్లో మార్పులకు కారణమవుతున్నాయి.

Show comments