సెప్టెంబర్ నెలలో లాంచ్ కాబోయే క్రేజీ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Smartphones: ప్రతి ఏడాది కూడా సెప్టెంబర్ నెలలో క్రేజీ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది కూడా సెప్టెంబర్ నెలలో కొన్ని క్రేజీ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Smartphones: ప్రతి ఏడాది కూడా సెప్టెంబర్ నెలలో క్రేజీ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది కూడా సెప్టెంబర్ నెలలో కొన్ని క్రేజీ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో కొత్త కొత్త మొబైల్ ఫోన్లు విడుదల అవుతూ ఉంటాయి. అందుకే ఈ నెల వచ్చిందంటే చాలు మొబైల్ లవర్లకు పెద్ద పండగనే చెప్పాలి. సెప్టెంబర్ నెలలో అనేక రకాల కొత్త మోడల్స్ విడుదల అవుతూ ఉంటాయి. అందువల్ల వినియోగదారులు కొత్త మొబైల్స్ కోసం షాపులకు క్యూ కడుతుంటారు. పైగా కొత్తగా రిలీజ్ అయ్యే ఫోన్స్ కావడం వలన వాటిపై ఎన్నో ఆఫర్లు ఉంటాయి. భారీ తగ్గింపులు ఉంటాయి. పైగా అక్టోబర్లో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెల్ నడుస్తుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యే స్మార్ట్ ఫోన్లపై బిగ్ బిలియన్ డేస్ లో భారీ డిస్కౌంట్లు ఉంటాయి. ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 10 వ తేదీన లాంచ్ కాబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సిరీస్ ప్రీ ఆర్డర్స్ సెప్టెంబర్ 13 నుంచి స్టార్ట్ కానున్నాయని సమాచారం తెలుస్తుంది. ఇక ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ సెప్టెంబర్ 20 వ తేదీన విడుదల అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. యాపిల్ సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారంలో కానీ రెండవ వారంలో కానీ తన మోడల్స్ ని లాంచ్ చేస్తూ ఉంటుంది. ఐఫోన్ 13 నుంచి ఇప్పటిదాకా అన్ని మోడల్స్ ని ఈ టైంలోనే లాంచ్ చేసింది. ఇక ఐఫోన్ 16 సిరీస్ ని కూడా సెప్టెంబర్ 10న లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ ధరలు రూ. 67,100 నుంచి స్టార్ట్ అవుతాయని తెలుస్తుంది.

అలాగే సెప్టెంబర్ నెలలో పోకో ఎక్స్ 7 నియో , రెడ్ మీ నోట్ 14 లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. వీటి ధరలు 25 వేల లోపు ఉండే అవకాశం ఉంది. ఇక ఐక్యూ 12 లైట్ 5జి ఫోన్ కూడా ఇదే నెలలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. దీని ధర 30 నుంచి 40 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇంకా మోటో నుంచి ఎడ్జ్ 50 నియో 5జి రూ. 19,999 ధరతో లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. మోటో జి 24 5జి ఫోన్ రూ. 16,707 ధరతో విడుదల అవుతుంది. వివో వై38 5జి 15 వేల బడ్జెట్లో లాంచ్ కానుండగా, ఆనర్ 200 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ 30 వేల లోపు వచ్చే అవకాశం ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ  దాదాపు రూ. 59,999 తో లాంచ్ కానుంది. టెక్నో ప్లాంటం వి ఫోల్డ్ 2 రూ. 75,000 నుంచి రూ. 80,000 ధరతో లాంచ్ కానుండగా, మోటోరోలా రేజర్ 50 రూ. 49,999తో , ఎంఐ మిక్స్ ఫ్లిప్ ఫోన్ రూ. 69,000 తో లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్లలో ఎక్కువ క్రేజ్ ఐఫోన్ 16 సిరీస్, టెక్నో ప్లాంటం వి ఫోల్డ్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ, మోటో మోడల్స్, ఎంఐ మిక్స్ ఫ్లిప్ ఫోన్లకు ఉంది. మరి మార్కెట్లోకి వచ్చాక ఏ ఫోన్ ఆదరణ పొందుతుందో చూడాలి.

Show comments