ఆరోజు ‘0’ ఆర్డర్స్.. Swiggy CEO ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Swiggy CEO Sriharsha Majety Comments On Zero Orders: ప్రస్తుతం అన్ని సిటీల్లో స్విగ్గీ తమ సర్వీసెస్ ని అందిస్తోంది. ఇప్పుడు స్విగ్గీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆరోజు మాత్రం ఒక్క ఆర్డర్ కూడా రాలేదు అనే విషయాన్ని సీఈవో స్వయంగా వెల్లడించారు.

Swiggy CEO Sriharsha Majety Comments On Zero Orders: ప్రస్తుతం అన్ని సిటీల్లో స్విగ్గీ తమ సర్వీసెస్ ని అందిస్తోంది. ఇప్పుడు స్విగ్గీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆరోజు మాత్రం ఒక్క ఆర్డర్ కూడా రాలేదు అనే విషయాన్ని సీఈవో స్వయంగా వెల్లడించారు.

ప్రస్తుతం ఇండియాలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇ-కామర్స్ కంటే కూడా ఇప్పుడు ఫుడ్ డెలివరీ, క్విక్ డెలివరీ యాప్సే బాగా వర్కౌట్ అవుతున్నాయి. అలా ఇప్పటికే బాగా పాపులర్ అయిన ఒక ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ. వీళ్లకు ఇండియాలో చాలానే పెద్ద మార్కెట్ ఉంది. అలాగే మంచి బిజినెస్ కూడా అవుతూ ఉంటుంది. ఈ స్విగ్గీ కొన్ని వేల మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. 24 గంటల్లో రెండున్నర లక్షల డెలివరీలు చేసిన రికార్డు స్విగ్గీ పేరిట ఉంది. కానీ, అదే స్వీగ్గీ ఒకరోజు జీరో డెలివరీ చేసింది. అంటే ఆ రోజు వారికి అస్సలు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు అంటే మీరు నమ్ముతారా? ఆ విషయాన్ని స్వయంగా స్విగ్గీ సీఈవోనే వెల్లడించారు.

స్వీగ్గీ సంస్థ తమ సేవలను ప్రారంభించి సరిగ్గా 10 సంవత్సరాలు అయ్యింది. ప్రస్తుతం స్విగ్గీ తమ పదో వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా స్విగ్గీ కో ఫౌండర్, సీఈవో శ్రీహర్ష మాజేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే స్విగ్గీ తమ ప్రయాణాన్ని మోదలు పెట్టిన క్షణాలను నెమరు వేసుకున్నారు. తమ తొలి రోజు అస్సలు ఒక ఆర్డర్ కూడా రాలేదు అని వెల్లడించారు. తమ సేవలు ప్రారంభించిన తొలిరోజు అస్సలు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు అనే విషయం తెలుసుకుని కస్టమర్స్ కూడా షాకవుతున్నారు. అయితే రెండో రోజు నుంచి తమకు ఆర్డర్స్ రావడం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు స్విగ్గీ ఏ స్థాయికి ఎదిగిందో అందరూ చూస్తూనే ఉన్నారు.

స్విగ్గీని తొలినాళ్లలో ఆదరించి.. నమ్మి.. ఆర్డర్స్ పెట్టుకున్న వినియోగదారులకు శ్రీహర్ష మాజేటీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం స్విగ్గీ దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా రెస్టారెంట్స్ తో టై అప్ అయ్యి ఉంది. అలాగే స్విగ్గీ ఇన్ స్టామార్ట్ సర్వీసెస్ గురించి కూడా మేజర్ సిటీల్లో ఉండేవారికి హాగా తెలుసు. సమయాన్ని బట్టి 7 నిమిషాల నుంచి 15 నిమిషాలల్లోపే మీరు ఆర్డర్ చేసుకున్న వస్తువులను డెలివరీ చేస్తారు. అలాగే బొమ్మలను కూడా ఈ మధ్య ఇన్ స్టామార్ట్ లో డెలవిరీ చేయడం ప్రారంభించారు. ఇలా స్విగ్గీ తమ సేవలను విస్తరించుకుంటూ పోతోంది. అలాగే తమ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ లో దూకుడుగా వ్యవహరిస్తోంది. మరి.. స్విగ్గీకి తొలిరోజు ఒక్క ఆర్డర్ కూడా రాకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments