P Venkatesh
సుకన్య సమృద్ధి యోజనలో మీరు డిపాజిట్ చేస్తున్నారా? అయితే మీరు ఆ తేదీలోగా ఇలా చేయకపోతే నష్టపోయే అవకాశం ఉంది. వెంటనే ఆ పని పూర్తి చేయండి.
సుకన్య సమృద్ధి యోజనలో మీరు డిపాజిట్ చేస్తున్నారా? అయితే మీరు ఆ తేదీలోగా ఇలా చేయకపోతే నష్టపోయే అవకాశం ఉంది. వెంటనే ఆ పని పూర్తి చేయండి.
P Venkatesh
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల వారిని ఆదుకునేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఆర్థిక భరోసా కల్పించే విధంగా పెట్టుబడి పథకాలను ప్రకటిస్తున్నాయి. దీనిలో భాగంగానే సుకన్య సమృద్ధియోజన పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ పథకంలో పెట్టుబడిపెడితే మంచి వడ్డీ రేటుతో అధికరాబడులు అందుకోవచ్చు. మరి మీరు సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్టు చేస్తున్నట్లైతే మీకు బిగ్ అలర్ట్. ఆ తేదీలోగా ఈ ఒక్క పని చేయకపోతే నష్టపోతారు. ఎస్ఎస్ వై అకౌంట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకీ మీరు చేయాల్సిన పని ఏంటంటే?
ఆర్థిక సంవత్సరం మారుతుందంటే ఎన్నో విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్లు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు సుకన్య సమృద్ధి స్కీమ్స్‌లో పొదుపు చేస్తున్నట్లైతే వెంటనే ఈ పని చేయండి. ఈ పథకంలో ప్రతి ఆర్థిక సంవత్సరం కనీస మొత్తాన్ని జమచేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులు డిపాజిట్ చేయడం విస్మరిస్తే ఖాతా ఫ్రీజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జమ చేయని వారు మార్చి 31లోగా ఆ పని చేయండి. లేదంటే ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందలేరు.
ఈ పథకంలో చేరి ప్రతి నెల కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసినట్లైతే ఆ సొమ్ముపై కేంద్రం 8.20 శాతం వడ్డీని కలిపిస్తుంది. ఈ డబ్బు ఆ అమ్మాయి చదువులకు, పెళ్లికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడంలో భాగంగానే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు చేరొచ్చు. అయితే వారి వయసు 10ఏళ్లలోపు ఉండాలి. ఏడాదిలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అమ్మాయికి 21ఏళ్లు వచ్చాక ఖాతా మెచ్యూరిటీ ఉంటుంది.