ఎన్నికల ముందు సామాన్యులకు మోదీ గిఫ్ట్‌.. భారీగా తగ్గనున్న పెట్రోల్‌, డిజీల్‌ ధరలు

Petrol Diesel Price: ఎన్నిలక ముందు మోదీ సర్కార్‌ సామాన్యులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా తగ్గించేందుకు సిద్ధం అవుతోంది అని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

Petrol Diesel Price: ఎన్నిలక ముందు మోదీ సర్కార్‌ సామాన్యులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా తగ్గించేందుకు సిద్ధం అవుతోంది అని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ ఎలక్షన్స్‌లో విజయం సాధించి.. హ్యాట్రిక్‌ కొట్టాలని మోదీ సర్కారు బలంగా నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు అమలు చేస్తోంది. గత ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా తగ్గిస్తూ.. సామాన్యులకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈక్రమంలో ఎన్నికల ముందు మోదీ సర్కార్‌ సామాన్యులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోందని సమాచారం. దీనిలో భాగంగా పెట్రోల్‌, డిజీల్‌ ధరలను భారీగా తగ్గించనుంది అని తెలుస్తోంది. ఆ వివరాలు..

మరో 2-3 నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు దిగి వస్తున్నాయి. దీన్ని అవకాశంగా వాడుకుని.. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం మోదీ సర్కార్‌ రెడీ అవుతోంది. డీజిల్‌, పెట్రోల్‌ ధరలను భారీగా తగ్గించబోతున్నట్లు సమాచారం. వచ్చే నెల ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం.. ప్రవేశపెట్టున్న మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు లీటర్‌పై రూ. 5-10 మధ్య తగ్గొచ్చని ఈ అంశంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపినట్లు ఆంగ్ల మీడియా వార్తలు ప్రచురిస్తోంది.

గతేడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 2023, రాఖీ పండుగ సందర్భంగా.. గ్యాస్ సిలిండర్ ధరల్ని ఒకేసారి రూ. 200 తగ్గించి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక ఉజ్వల పథకం కింద సబ్సిడీని కూడా రూ. 200 నుంచి రూ. 300 కు పెంచింది. అలానే వంట నూనె ధరలు కూడా దిగి వస్తున్నాయి.

ఇక గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ తమను గెలిపిస్తే.. 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో.. ఇది అమల్లోకి రానుంది. బీఆర్‌ఎస్‌ కూడా మరోసారి అధికారంలోకి వస్తే.. గ్యాస్‌ ధరను భారీగా తగ్గిస్తామని ప్రకటించింది. కేంద్రం ఇప్పటికే గ్యాస్‌ ధరను తగ్గించింది. అందుకే త్వరలోనే ఇంధన ధరలను కూడా తగ్గించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు. ఇదే జరిగితే.. సామాన్యులకు పెద్ద ఊరట లభించినట్లే అంటున్నారు.

Show comments