మీ బైక్‌కి ఇదొక్కటి ఉంటే చాలు.. ఎండకు ఎండరు, వర్షానికి తడవరు..

Sepal Shield: వర్షం పడుతున్నప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి రోడ్డు సరిగా కనబడక బండి స్కిడ్ అవుతుంది కూడా. అయితే ఈ పరికరాన్ని మీ బైక్ కి పెట్టుకుంటే బండ్లు స్కిడ్ అవ్వకుండా కాపాడతాయి. ఎంతటి వర్షంలో అయినా సరే తడవకుండా వెళ్లిపోవచ్చు.

Sepal Shield: వర్షం పడుతున్నప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి రోడ్డు సరిగా కనబడక బండి స్కిడ్ అవుతుంది కూడా. అయితే ఈ పరికరాన్ని మీ బైక్ కి పెట్టుకుంటే బండ్లు స్కిడ్ అవ్వకుండా కాపాడతాయి. ఎంతటి వర్షంలో అయినా సరే తడవకుండా వెళ్లిపోవచ్చు.

వర్షంలో తడవకుండా.. ఎండకు ఎండకుండా కారులో వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. కానీ కారు ఉన్నవారికే అది సాధ్యపడుతుంది. కారు లేని మిడిల్ క్లాస్ వారికి బైకే దిక్కు. వర్షం పడినా.. ఎండ తీవ్రత ఎక్కువైనా బిక్కుబిక్కుమంటూ బైక్ మీదనే వెళ్ళాలి. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. అయితే మరీ వర్షం ఎక్కువ పడుతున్నప్పుడు, ఎండ తీవ్రత దారుణంగా ఉన్నప్పుడు మాత్రం బైక్ తోలడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మీకు ఈ సెపాల్ షీల్డ్ బాగా ఉపయోగపడుతుంది. డస్ట్ పొల్యూషన్ ఉండదు, వర్షంలో తడిచిపోతామన్న భయం ఉండదు, ఎండకు వడదెబ్బ తగులుతుందన్న టెన్షన్ ఉండదు. కారులో పోయినట్టు రయ్ రయ్ మంటూ దూసుకుపోవచ్చు. 

ముఖ్యంగా వర్షం పడినప్పుడు బైక్ డ్రైవింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. వర్షం నీళ్లు కళ్ళలో పడుతుంటే డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. హెల్మెట్ మీద పడినా రోడ్డు సరిగా కనబడదు. అందుకే సెపాల్ కంపెనీ అన్ని వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా బైక్ రైడర్ల కోసం ఒక సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. ఎండ, వర్షం, కాలుష్యం బారిన పడకుండా ఉండేలా సెపాల్ వైండ్ షీల్డ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక సైడ్ కి నాన్ బ్రేకబుల్ గ్లాస్ ఉండి, పైన ఒక రూఫ్ లా ఉంటుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది.

దీన్ని బైక్ పెట్రోల్ ట్యాంక్ కి ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని అన్ని బైక్ లకి సెట్ అయ్యేలా యూనివర్సల్ పరికరంగా తయారు చేశారు. హైట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎండ, వాన, దుమ్ము నుంచే కాదు ఈదురుగాలుల నుంచి కూడా కాపాడుతుంది. రాత్రి పూట కంట్లో పురుగులు పడకుండా ఆపుతుంది. అన్ని రకాలుగా ఇది మీకు రక్షణ కవచంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇది బైక్ రైడర్స్ కోసం డిజైన్ చేశారు. భవిష్యత్తులో స్కూటీల కోసం కూడా తయారు చేస్తారేమో చూడాలి. ఇక సెపాల్ వెబ్ సైట్ లో దీని అసలు ధర రూ. 8600 ఉండగా.. ఆఫర్ లో రూ. 6,599 రూపాయలకు అందుబాటులో ఉంది.    

ప్రత్యేకతలు: 

మీ హైట్ ని బట్టి ఈ షీల్డ్ ని పైకి, కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఒక మొబైల్ హోల్డర్ కూడా ఇస్తున్నారు. దీని మీద మొబైల్ ని పెట్టుకోవచ్చు. ఇది యాంటీ థెఫ్ట్ లాక్ తో వస్తుంది. ఈ షీల్డ్ ని5 నిమిషాల్లో సులువుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ షీల్డ్ ని బైక్ నడిపే వ్యక్తికే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా పైన రూఫ్ అనేది ఎక్స్ టెండ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు 1650 రూపాయలు చెల్లించి మిగతా అమౌంట్ 3, 6 నెలల పాటు ఈఎంఐగా చెల్లించవచ్చు. జెస్ట్ వంటి ఫైనాన్షియల్ యాప్స్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐలో ఈ పరికరాన్ని కొనుక్కోవచ్చు. 

కొన్న తర్వాత ఇన్స్టాల్ ఎలా చేయాలో ఈ కింది వీడియో చూడండి

 

Show comments