రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయ రుణాల కోసం SBI కీలక నిర్ణయం

State Bank Of India: రైతులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. వ్యవసాయ రుణాల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రుణాలు వేగంగా అందనున్నాయి.

State Bank Of India: రైతులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. వ్యవసాయ రుణాల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రుణాలు వేగంగా అందనున్నాయి.

వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నేటి రోజుల్లో వ్యవసాయం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దుక్కిదున్నే దగ్గరి నుంచి పంట చేతికి వచ్చే వరకు వేల రూపాయలు పెట్టుబడికే పోతుంది. అయితే అన్నదాతలు పెట్టుబడికోసం అప్పులు చేస్తుంటారు. పంట రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు శుభవార్తను అందించింది. రైతులకు వ్యవసాయ రుణాల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ నిర్ణయంతో రైతులకు వ్యవసాయ రుణాలు వేగంగా అందనున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 69వ వ్యవస్థాపక దినోత్సవం సంద్రర్భంగా వ్యవసాయ రుణాల మంజూరుకు స్పెషల్ సెంటర్లు సహా మొత్తం 11 కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రైతులకు వ్యవసాయ రుణాలు వేగంగా మంజూరు చేసేందుకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు ఎస్బీఐ సిద్ధమైంది. వ్యవసాయ లోన్స్ కోసం అగ్రికల్చర్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో ప్రస్తుతానికి 35 స్పెషల్ సెంటర్లను ప్రారంభించింది. దీంతో రైతులకు లోన్స్ వేగంగా అందనున్నాయి. అలాగే డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు బ్యాంక్స్ యాప్స్‌లో మరిన్ని కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ చెల్లింపులను విస్తరించేందుకు బీమ్ ఎస్‌బీఐ పే యాప్‌లో టాప్ అండ్ పే తీసుకొచ్చింది.

యోనో యాప్‌లో మ్యుచువల్ ఫండ్స్‌పై డిజిటల్ లోన్స్ అందించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. సూర్య ఘర్ స్కీమ్‌ కింద రుణాలు మంజూరు చేసేందుకు సూర్య ఘర్ లోన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం పంజాబ్‌లోని పటియాలలో రెండవ గ్లోబల్ ఎన్ఆర్ఐ కేంద్రాన్ని స్టేట్ బ్యాంక్ ప్రారంభించింది. న్యాయవాదులకు మరిన్ని సేవలు అందించేందుకు హైకోర్టుల్లోని బ్యాంకు బ్రాంచీలను రీడిజైన్ చేయనున్నట్లు తెలిపింది. హోమ్ లోన్ల మంజూరు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Show comments