nagidream
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధర ఇప్పుడు 2 లక్షలు పైనే ఉంది కదా. అదే ఈ బైక్ ఒకప్పుడు ఎంత ఉంటుందని అనుకుంటున్నారు. ధర తెలిస్తే మరీ ఇంత చీపా అని నోరెళ్లబెడతారు.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధర ఇప్పుడు 2 లక్షలు పైనే ఉంది కదా. అదే ఈ బైక్ ఒకప్పుడు ఎంత ఉంటుందని అనుకుంటున్నారు. ధర తెలిస్తే మరీ ఇంత చీపా అని నోరెళ్లబెడతారు.
nagidream
రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డడ్డడ్డడ్డడ్డడ్డడ్ అంటూ బైక్ మీద వస్తుంటే అందరి చూపు ఆ బైక్ నడిపే వాడి మీదనే ఉంటుంది. కార్లలో రోల్స్ రాయిస్ కారు కొనడాన్ని ఎలా అయితే స్టేటస్ సింబల్ గా భావిస్తారో.. అలా ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని కూడా స్టేటస్ సింబల్ గా భావిస్తారు. ఏళ్ళు గడిచేకొద్దీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లో సాంకేతిక మార్పులు తెచ్చినప్పటికీ కంపెనీ వాళ్ళు మాత్రం బైక్ రూపాన్ని, దాన్ని నడిపితే పొందే అనుభూతిని పోకుండా కాపాడుతూ వచ్చారు. అన్నేళ్లపాటు ఆ బైక్ ని మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక మార్పులు తీసుకొస్తున్నా గానీ బైక్ ని చెడగొట్టకుండా కాపాడుతూ రావడం అంటే మామూలు విషయం కాదు.
అయితే ఇప్పుడున్న ఆల్ న్యూ క్లాసిక్ 350 బైక్ ధర 2.2 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూం ధర. అయితే ఈ మోడల్ బైక్ ధర 1986లో రూ. 18,700 మాత్రమే. ఏంటి షాక్ అయ్యారా? 20 వేల లోపే బైక్ అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఓ వ్యక్తి ఇన్ స్టా ఖాతాలో బైక్ ధరకు సంబందించిన ఇన్వాయిస్ ను షేర్ చేశాడు. జనవరి 23, 1986లో ఆ బైక్ ని కొనుగోలు చేశారు. సందీప్ ఆటో కంపెనీ అనే డీలర్ వద్ద ఆర్.ఎస్. ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ వారు ఈ బైక్ ని చీప్ గా రూ. 18,700కి కొనేశారు. ఝార్ఖండ్ లోని బొకారో స్టీల్ సిటీలో కొఠారి మార్కెట్ లో దీన్ని కొనుగోలు చేశారు. 36 ఏళ్ల క్రితం రూ. 18,700కి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వచ్చింది. అదే రూ. 18,700కి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ డొక్కు బైక్ వస్తుంది. బిల్లులో ఎన్ఫీల్డ్ బుల్లెట్ అని మెన్షన్ చేశారు.
ఈ బుల్లెట్ ని అప్పట్లో ఇండియన్ ఆర్మీ వాళ్ళు సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేయడానికి ఉపయోగించేవారు. ఓ వ్యక్తి దీన్ని ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా దానికి నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 1986లో బుల్లెట్ ధర 18,700 అంటే ఇప్పుడు 2 లక్షలు పైమాటే. ఆ డబ్బుతో అప్పట్లో భూమి కొని ఉంటే 2 ఎకరాల పొలం వచ్చేది. దాని విలువ ఇప్పుడు 10 కోట్లు అయ్యేది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. అది కూడా కరెక్టే కద సార్. కానీ బుల్లెట్ అనే ఎమోషన్ ముందు ఏదీ కనిపించదు. 1980లో బాంబేలో (ఇప్పుడు ముంబై) మినర్వా సినిమా ఎదురుగా గ్రాంట్ రోడ్ లో ఉన్న అలీ భాయ్ అనే డీలర్ దగ్గర 10,500కే బుల్లెట్ కొన్నానని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. అప్పట్లో 10 వేలు అంటే లక్ష కంటే ఎక్కువే. అప్పుడూ, ఇప్పుడూ ఏం మారలేదు. కానీ ఇప్పటి రేట్లకి, అప్పటి ధరలకి తేడా తలచుకుంటే బాధనిపిస్తుంది. మరి 20 వేల లోపే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధర ఉండడంపై మీ అబిప్రాయమేమిటో కామెంట్ చేయండి.