పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పై RBI కొరడా.. ఏకంగా 1.3 కోట్ల జరిమానా

Punjab National Bank: బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ జరిమానా విధిస్తూ.. లైసెన్సులను సైతం రద్దు చేస్తున్నది.

Punjab National Bank: బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ జరిమానా విధిస్తూ.. లైసెన్సులను సైతం రద్దు చేస్తున్నది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను నియంత్రిస్తూ ఉంటుంది. నియమాలను ఉల్లంఘించే బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఖాతాదారులకు నష్టంవాటిల్లకుండా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల ఆర్బీఐ పలు బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తున్నది. చట్టాలను అతిక్రమించే బ్యాంకులపై ఉక్కుపాదంమోపుతున్నది. ఈ క్రమంలో పలు బ్యాంకులపై భారీగా జరిమానా విధిస్తున్నది. అంతేకాదు కొన్ని బ్యాంకుల లైసెన్సులను సైతం రద్దు చేస్తున్నది. తాజాగా మరో బ్యాంకుపై భారీ జరిమానా విధించింది. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు ఏకంగా 1.31 కోట్ల ఫైన్ విధించింది.

బ్యాంకులు ఆర్బీఐ నియమాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఒక వేళ బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించినట్లైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా వ్యవహరించిన పీఎన్బీపై భారీ జరిమానా విధించింది. లోన్స్, అడ్వాన్సులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు గానూ పీఎన్‌బీపై రూ.1.31 కోట్ల జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్ల చిరునామాలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడంలో విఫలమైందని ఓ ప్రకటనలో ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంక్‌ పనితీరుపై 2022 మార్చి30న ఆర్‌బీఐ తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు పాటించని బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది.

పీఎన్బీ బ్యాంకు వివరణతో సంతృప్తి చెందని ఆర్‌బీఐ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఆర్బీఐ ఇటీవల పలు కోపరేటివ్ బ్యాంకుల లైసెన్స్ రద్దుతో పాటు జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నప్పటికి బ్యాంకుల పనితీరులో మాత్రం మార్పు రావడం లేదు. బ్యాంకులపై ఆర్బీఐ చర్యలతో ఖాతాదారులు తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకోవడానికి ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మరి పీఎన్బీపై ఆర్బీఐ భారీ జరిమానా విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments