క్విక్ కామర్స్‌లోకి రిలయన్స్.. ఇక 30 నిమిషాల్లోనే సరుకులు ఇంటికి!

క్విక్ కామర్స్‌లోకి రిలయన్స్.. ఇక 30 నిమిషాల్లోనే సరుకులు ఇంటికి!

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మనిషి జీవన శైలిలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఏవైనా వస్తువులు కొనాలంటే ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్విక్ కామర్స్‌లోకి రిలయన్స్ తిరిగి మళ్లీ ఎంట్రీ ఇస్తుంది.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మనిషి జీవన శైలిలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఏవైనా వస్తువులు కొనాలంటే ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్విక్ కామర్స్‌లోకి రిలయన్స్ తిరిగి మళ్లీ ఎంట్రీ ఇస్తుంది.

ప్రస్తుత రోజుల్లో ఏదైనా వస్తువును కొనేందుకు షాపులకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. అంతా ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నారు. కూర్చున్న చోటు నుంచే బుక్ చేసుకుంటే ఇంటికే డెలివరీ అవుతుండడంతో ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నారు. తక్కువ సమయంలోనే కావాల్సిన సరుకులు డెలివరీ అవుతుండడంతో వినియోగదారుల సమయం కూడా ఆదా అవుతోంది. ఇప్పటికే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌, బ్లింకిట్‌, జెప్టో, బీబీనౌ వంటి సంస్థలు నిత్యావసర సరుకులను డెలివరీ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తిరిగి క్విక్‌ కామర్స్‌‌లోకి ప్రవేశించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు రిలయన్స్‌ రిటైల్‌ ఓ టీమ్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. జియో మార్ట్‌ పేరిట కరోనా సమయంలో నిత్యావసర సరకుల డెలివరీ విభాగంలోకి రిలయన్స్ ప్రవేశించిన విషయం తెలిసిందే.

రిలయన్స్‌ రిటైల్‌ ఇప్పుడు 30 నిమిషాల్లోనే సరుకులను ఇంటికి డెలివరీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం ఫైండ్‌, లోకస్‌ వంటి టెక్నాలజీల సాయంతో వేగవంతమైన రూట్లలో 30 నిమిషాల్లో డెలివరీ చేయాలని రిలయన్స్‌ సన్నద్ధమవుతుందని సమాచారం. సొంత స్టోర్లు, వాటి నుంచి కొనుగోలు చేసే కిరాణా షాపుల నుంచి ఉత్పత్తులను సేకరించి కస్టమర్లకు అందించే యోచనలో రిలయన్స్ జియో మార్ట్ ఉంది. జియో మార్ట్‌ పార్ట్‌నర్‌లో భాగంగా 20 లక్షల కిరాణా దుకాణాలు రిలయన్స్‌ రిటైల్‌ హోల్‌సేల్‌ విభాగం నుంచి కొనుగోళ్లు చేస్తున్నాయి.

కాగా వచ్చే జూన్‌లోనే రిలయన్స్ క్వి క్విక్‌ కామర్స్‌ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌, కోల్‌కతాలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుందట కంపెనీ. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. జియో మార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా వీటిని అందించనున్నట్లు తెలుస్తోంది. జియోమార్ట్‌ యాప్‌లోనే ఇది భాగంగా ఉండనుంది. రిలయన్స్‌ 2023లోనే క్విక్‌ కామర్స్‌ను ముంబైలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కొంత కాలానికే ఆ సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ రిలయన్స్ క్విక్ కామర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి వినియోగదారులకు 30 నిమిషాల్లోనే సరుకులను ఇంటికి చేర్చేందుకు ప్లాన్ చేస్తోంది.

Show comments