బ్యాంక్‌ పనులుంటే ముందే చూసుకొండి.. సెప్టెంబర్‌లో 17 రోజులు సెలవులు

నెల ప్రారంభం అయ్యిందంటే చాలు కొన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు.. గ్యాస్‌ ధరలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే బ్యాంక్‌లు.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి.. కీలక నిర్ణయాలు అమలు చేస్తాయి. ఇవే కాక.. నెల ప్రారంభంలో అందరూ వెతికే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. బ్యాంకులకు సెలవులు. సాధారణంగా బ్యాంకులకు నాలుగు ఆదివారాలతో పాటు.. రెండవ శనివారం, నాల్గవ శనివారం సెలవు ఉంటుంది.

ఇవే కాక.. స్థానిక పండుగలు, పర్వదినాలకు అనుగుణంగా సెలవులు ప్రకటిస్తుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ). నేడు అనగా శుక్రవారం నుంచి సెప్టెంబర్‌ నెల ప్రారంభం అయ్యింది. ఈ నెలలో బ్యాంక్‌లకు ఏకంగా 17 రోజులు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సెలవులు ఒకేలా ఉండవు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వచ్చాయి అంటే..

సెప్టెంబర్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు మొత్తం ఎనిమిది రోజులపాటు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ఆదివారాలు, రెండో, నాల్గవ శనివారంతో పాటు.. మరో మూడు రోజులు సెలవులు ఉన్నాయి. ఏ ఏ తేదీల్లో బ్యాంక్‌లకు సెలవులున్నాయంటే..

సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవులు:

  • 3 సెప్టెంబర్: ఆదివారం (అన్ని బ్యాంక్‌లకు సెలవు)
  • 6 సెప్టెంబర్: శ్రీకృష్ణ జన్మాష్టమి (కొన్ని ప్రాంతాల్లో సెప్టెంర్‌ 6నే జన్మాష్టమి జరుపుతున్నారు)
  • 7 సెప్టెంబర్: శ్రీకృష్ణ జయంతి (గుజరాత్, మధ్యప్రదేశ్, చంఢీగఢ్, సిక్కిం, రాజస్థాన్, జమ్మూ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ లలో సెలవులు)
  • 9 సెప్టెంబర్: రెండవ శనివారం
  • 10 సెప్టెంబర్: ఆదివారం
  • సెప్టెంబర్ 17: ఆదివారం
  • సెప్టెంబర్ 18: వరసిద్ధి వినాయక వ్రతం, వినాయక చవితి (కొన్ని ప్రాంతాల్లో.. సెప్టెంబర్‌ 18నే వినాయక చవితి జరుపుతున్నారు)
  • సెప్టెంబర్ 19: గణేష్ చతుర్థి (గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, గోవా ప్రాంతాలలో 19వ తేదీ సెలవుగా ప్రకటించారు)
  • సెప్టెంబర్ 20: గణేష్ చతుర్థి 2వ రోజు నుఖాయ్ ఒడిశాలో దీన్ని జరుపుకుంటారు. కేవలం ఒడిశాలో మాత్రమే బ్యాంక్‌లకు సెలవు.
  • సెప్టెంబర్ 22: శ్రీ నారాయణ గురు సమాధి చెందిన రోజు. కేరళలో ఇది ప్రాంతీయ సెలవు.
  • సెప్టెంబర్ 23: నాల్గవ శనివారం. ఇదేరోజు మహారాజా హరి సింగ్ పుట్టిన రోజు. జమ్మూ, శ్రీనగర్ లో ప్రాంతీయ సెలవురోజు.
  • సెప్టెంబర్ 24: ఆదివారం సెప్టెంబర్ 25: ఈద్ ఇ మిలాద్ ఉన్ నబీ
  • సెప్టెంబర్ 27: మిలాద్ ఎ షరీఫ్ (మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు) (కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బ్యాంక్‌లకు సెలవు)
  • సెప్టెంబర్ 28: ఈద్ అల్ అధా లేదా మిలాదున్నబి. ఇది జాతీయ సెలవు దినం. అన్ని బ్యాంకులకు ఈ సెలవు వర్తిస్తుంది.
  • సెప్టెంబర్ 30: ఆదివారం (అన్ని బ్యాంక్‌లు బంద్‌)

Show comments