P Venkatesh
Punjab national Bank KYC Update: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీకు ఆ బ్యాంకులో ఖాతా ఉంటే ఆగస్టు 12 లోపు ఈ పని చేయండి. లేదంటే నష్టపోతారు. ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఛాన్స్ ఉంది.
Punjab national Bank KYC Update: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీకు ఆ బ్యాంకులో ఖాతా ఉంటే ఆగస్టు 12 లోపు ఈ పని చేయండి. లేదంటే నష్టపోతారు. ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఛాన్స్ ఉంది.
P Venkatesh
ఈరోజుల్లో దాదాపు అందరు బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. డబ్బును పొదుపు చేసుకునేందుకు, లోన్స్ పొందేందుకు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు కూడా బ్యాంక్ ఖాతాలు అవసరమవుతుంటాయి. వివిధ అసరాల రీత్యా కొందరు వ్యక్తులు ఒకటికంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉంటారు. ఖాతాదారులు ట్రాన్సాక్షన్స్ చేయకపోయినా, మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయకపోయినా అకౌంట్ ఇనాక్టివ్ లోకి వెళ్లడం, ఫైన్ పడడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీకు ఆ బ్యాంకులో ఖాతా ఉంటే ఆగస్టు 12 లోపు ఈ పని చేయండి. లేదంటే నష్టపోతారు. ఇంతకీ ఏ బ్యాంక్ అంటే?
బ్యాంక్ సేవలు అంతరాయం లేకుండా పొందాలంటే బ్యాంక్ రూల్స్ ను ఖాతాదారులు పాటించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్యాంక్ నియమాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతా ఉందా? అయితే మీరు ఈ పని వెంటనే చేయండి. లేదంటే అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతా కలిగిన వారు నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆగస్టు 12వరకు మాత్రమే గడువు ఉంది. ఈ ఏడాది మార్చి 31 వరకు కేవైసీ అప్ డేట్ చేయని ఖాతాదారులకు ఈ కొత్త గైడ్ లైన్స్ వర్తిస్తాయని పీఎన్బీ వెల్లడించింది. అంతరాయం లేకుండా బ్యాంక్ సేవలు పొందాలంటే తప్పనిసరిగా కేవైసీని కంప్లీట్ చేసుకోవాలని తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు తమ కార్యకలాపాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే పీఎన్బీ ఖాతాదారులకు కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది. పీఎన్బీలో అకౌంట్ కలిగిన కస్టమర్లు తమ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఫోటో, పాన్ కార్డు, ఆదాయపు ధ్రువపత్రాలు, మొబైల్ నంబర్ వంటి వివరాలు బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. పీఎన్‌బీ వన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్, రిజిస్టర్డ్ ఇ-మెయిల్, పోస్ట్ ద్వారా కేవైసీ అప్ డేట్ చేసుకోవచ్చు. లేదా సమీపంలోని ఏదైనా పీఎన్‌బీ బ్రాంచ్‌కి వెళ్లి కేవైసీ అప్డేట్ పూర్తి చేయాలని కోరింది.
Important Announcement. Please take a note.#KYC #bankaccount #ImportantNotice #banking #PNB pic.twitter.com/FJgIuoiktO
— Punjab National Bank (@pnbindia) August 2, 2024