Money: ప్రతి నెలా మంచి లాభాలు కావాలా? అయితే ఈ స్కీమ్ చాలా బెస్ట్!

Money: చాలా మంది కూడా ప్రతి నెలా మంచి లాభాలనిచ్చే బెస్ట్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్ చాలా బెస్ట్ అనే చెప్పాలి.

Money: చాలా మంది కూడా ప్రతి నెలా మంచి లాభాలనిచ్చే బెస్ట్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్ చాలా బెస్ట్ అనే చెప్పాలి.

పెట్టుబడి పెట్టేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అయితే మన ఆర్ధిక పరిస్థితిని బట్టి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఎలాంటి రిస్క్ లేకుండా పెన్షన్ లాగా ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలని కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పే ఈ స్కీమ్ మీకోసమే. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టారంటే కచ్చితంగా ప్రతినెలా గ్యారెంటీ లాభాలు వస్తాయి. ఇక ఆ స్కీమ్ పేరు పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (Postoffice Monthly Income Scheme). ఇక ఈ స్కీమ్ లో మినిమమ్ ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టవచ్చు? ఎంత వడ్డీ పొందవచ్చు? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పథకాన్ని పోస్టాఫీసు చాలా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసేవారికి కేంద్రం నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా సేఫ్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మంచి వడ్డీ రేటుతో ప్రతి నెల గ్యారెంటీ రిటర్న్స్ అందించే బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఇక పోస్టాఫీస్ మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ రూ. 1000గా ఉంది. అలాగే సింగిల్ అకౌంట్ తీసుకున్న వారు మాక్సిమం రూ. 9 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక జాయింట్ అకౌంట్ తీసుకోవాలనుకునేవారు రూ. 15 లక్షల దాకా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ టెన్యూర్ మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతం ఉంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లను పెంచ్చచ్చు లేదా తగ్గించవచ్చు. లేదా ఫిక్స్డ్ గా కొనసాగించవచ్చు.

జాయింట్ ఖాతా తీసుకోవాలనుకుంటే మాక్సిమం ముగ్గురికి అవకాశం ఉంటుంది. 10 ఏళ్లు పైబడిన మైనర్ లేదా వికలాంగుల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలంటే గార్డియన్స్ సాయంతో ఇన్వెస్ట్ చేయవచ్చు.ఈ పోస్టాఫీసు మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో సపోజ్ మీరు రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు ప్రతి నెలా రూ. 3083 వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. అదే ఒకేసారి ఈ స్కీమ్‌లో రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే అప్పుడు నెలకి రూ. 5550 వడ్డీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకి రూ. 9250 వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఇదీ సంగతి. ప్రతి నెలా గ్యారెంటీ రిటర్న్స్ కావాలనుకునేవారికి ఇది చాలా బెస్ట్ స్కీమ్. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments