పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. భారీగా ఛార్జీలు పెంపు!

PNB revises savings account charges: ఆ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంక్ సేవలకు సంబంధించిన ఫీజులను, ఛార్జీలను భారీగా పెంచనున్నది. ఇంతకీ ఏయే ఛార్జీలు పెరగనున్నాయంటే?

PNB revises savings account charges: ఆ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంక్ సేవలకు సంబంధించిన ఫీజులను, ఛార్జీలను భారీగా పెంచనున్నది. ఇంతకీ ఏయే ఛార్జీలు పెరగనున్నాయంటే?

మన దేశంలో అనేక బ్యాంకులు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ రంగానికి చెందినవి ఉన్నాయి. ఇదే సమయంలో బ్యాంకులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా బ్యాంకులు కూడా తరచూ ఏదో ఒక విషయాన్ని తమ కస్టమర్లకు చెబుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని గుడ్ న్యూస్ లు ఉంటాయి, మరికొన్ని బ్యాడ్ న్యూస్ లు ఉంటాయి. తాజాగా ప్రముఖ బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది. పలు సేవలకు సంబంధించిన ఛార్జీలను పెంచనున్నది. దీంతో బ్యాంక్ ఖాతాదారుల జేబులకు చిల్లు పడే అవకాశం ఉంది. ఇంతకీ ఏయే ఛార్జీలు పెరగనున్నాయంటే?

బ్యాంకులు తరచుగా కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. కొత్త నియమాలను ఖాతాదారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. లేదంటే ఆర్థిక నష్టాలను భరించాల్సి వస్తుంది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్ ఖాతాలకు సంబంధించిన కొన్ని ఫీజులను మార్చింది. ఈ ఫీజులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

నెలవారీ కనీస యావరేజ్ బ్యాలెన్స్:

బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాల్లో బ్యాంక్ రూల్స్ ప్రకారం మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, పట్టణాల్లో రూ.1000 రూపాయలు, నగరాలు, మెట్రో నగరాల్లో రూ.2000 రూపాయలు ఈ మినిమమ్‌ యావరేజ్ బ్యాలెన్స్‌గా ఉండాలి. అయితే ఇది వరకు మినిమమ్‌ యావరేజ్ బ్యాలెన్స్‌ను ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించేవారు. కొత్త రూల్ ప్రకారం ఈ మినిమమ్‌ యావరేజ్ బ్యాలెన్స్‌ను ప్రతి నెలకు లెక్కించాలి.

నెలవారీ కనీస క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్:

పీఎన్‌బీ కస్టమర్లు తమ ఖాతాలో మినిమమ్‌ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఉంచాలి. దీనికంటే తక్కువ మొత్తం ఉంటే, దాన్ని క్యూఏబీ షార్ట్‌ఫాల్ అంటారు. ఈ షార్ట్‌ఫాల్‌కు బ్యాంకు ఒక నిర్ణీత మొత్తాన్ని ఛార్జీ విధిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో: యావరేజ్ బ్యాలెన్స్ 50% కంటే తక్కువ మొత్తం ఉంటే, రూ.50 ఛార్జీ విధిస్తారు. పట్టణాల్లో యావరేజ్ బ్యాలెన్స్ 50% కంటే తక్కువ ఉంటే, రూ.100 ఛార్జీ విధిస్తారు. నగరాలు, మెట్రో నగరాల్లో ఖాతాలో ఉండవలసిన మొత్తం కంటే 50% కంటే తక్కువ మొత్తం ఉంటే, రూ.150 చార్జీ విధిస్తారు.

డిమాండ్ డ్రాఫ్ట్స్ ఇష్యూయన్స్:

డిమాండ్ డ్రాఫ్ట్‌లు ఇష్యూ చేయడానికి సంబంధించిన చార్జీలలో మార్పులు వచ్చాయి. ఆ రూల్స్ ప్రకారం అన్ని మొత్తాలకు డిమాండ్ డ్రాఫ్ట్ మొత్తంలో 0.40% ఫీజు ఉంటుంది. మినిమం ఫీజు 50 రూపాయలు కాగా గరిష్ట ఫీజు 15,000 రూపాయలు ఉంటుంది.

డూప్లికేట్ డిమాండ్ డ్రాఫ్ట్స్ ఇష్యూయన్స్:

కొత్త నియమాలు ప్రకారం, డూప్లికేట్ డిమాండ్ డ్రాఫ్ట్ రూ.200… డిమాండ్ డ్రాఫ్ట్ రీవాలిడేషన్ రూ.200… డిమాండ్ డ్రాఫ్ట్ క్యాన్సిలేషన్ రూ.200.

చెక్‌ రిటర్నింగ్ ఛార్జెస్:

సేవింగ్స్ అకౌంట్లు: బ్యాలెన్స్ తక్కువ ఉండటం వల్ల చెక్ తిరిగి వస్తే, ప్రతి చెక్‌కు రూ.300 చార్జ్.

కరెంట్ అకౌంట్లు, క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లు: బ్యాలెన్స్ తక్కువ ఉండటం వల్ల మొదటి మూడు చెక్‌లు తిరిగి వస్తే, ప్రతి చెక్‌కు రూ.300 చార్జ్. అదే ఆర్థిక సంవత్సరంలో నాలుగు చెక్‌లు లేదా అంతకంటే ఎక్కువ చెక్‌లు తిరిగి వస్తే, ప్రతి చెక్‌కు రూ.1,000 చార్జ్ చేస్తారు.

బ్యాలెన్స్ తక్కువ ఉండటం తప్ప మరో కారణం వల్ల చెక్ తిరిగి వస్తే: ప్రతి చెక్‌కు 100 రూపాయలు చార్జ్. టెక్నికల్ ఫాల్ట్‌లు లేదా ఫెయిల్యర్‌ల వల్ల చెక్ తిరిగి వస్తే: అన్ని అకౌంట్లకు ఉచితం.

లాకర్ ఛార్జెస్:

చిన్న లాకర్లకు సవరించిన ఛార్జీలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.1,250, పట్టణ, మెట్రో ప్రాంతాల్లో రూ.2,000. మీడియం లాకర్లకు కొత్త ఛార్జీలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,200, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2,500, పట్టణ, మెట్రో ప్రాంతాల్లో రూ.3,500. పెద్ద లాకర్లకు సవరించిన అద్దె గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.3,000, పట్టణ, మెట్రో ప్రాంతాల్లో రూ.5,500. చాలా పెద్ద లాకర్లకు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.6,000, పట్టణ, మెట్రో ప్రాంతాల్లో రూ.8,000 ఛార్జీలు మారవు. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్లకు అన్ని లొకేషన్లలో ఛార్జీలు రూ.10,000గా ఉంటాయి.

Show comments