PhonePe, GPay యూజర్లకు అలర్ట్.. జనవరి 1నుంచి కొత్త రూల్స్!.. అవేంటంటే?

కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. కొత్త ఏడాదితో పాటు అనేక విషయాల్లో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఫోన్ పే, గూగుల్ పేతో పాటు ఇతర విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. కొత్త ఏడాదితో పాటు అనేక విషయాల్లో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఫోన్ పే, గూగుల్ పేతో పాటు ఇతర విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ మయం అయిపోయింది. ప్రజలంతా చెల్లింపులన్నీ ఆన్ లైన్ ద్వారానే చేస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల దగ్గర్నుంచి మొదలుకుని పెద్ద పెద్ద కంపెనీల వరకు పేమెంట్స్ అన్నీ ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు కోట్లల్లో జరుగుతున్నాయి. కాగా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ఫోన్ పే, గూగుల్ పేలో కొత్త ఏడాది పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. జనవరి 1 నుంచి ఫోన్ పే, గూగుల్ పే తీసుకొచ్చిన న్యూ రూల్స్ యూజర్లు ఫాలో కావాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఇతర అంశాలకు చెందిన వాటిల్లో కూడా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.

జనవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

యూపీఐ డీయాక్టివేట్ :

ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా య ఫోన్ పే, గూగుల్ పేలకు సంబంధించి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31 2023 వరకు వాడకంలో లేని యూపీఐ ఐడీలు పనిచేయవని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభమైన వేళ జనవరి 1 నుంచి ఏడాది పాటు ఏవిధమైన లావాదేవీలు జరుగని యూపీఐ ఖాతాలు మూసివేయబడతాయి. బ్యాంకులు, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్‌లు కూడా జనవరి 1 నుంచి అటువంటి యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేస్తాయి.

కొత్త సిమ్ కార్డ్ కోసం

ఇదివరకే కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి సిమ్ కార్డుల జారీ విషయంలో కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 1 నుంచి కొత్త సిమ్‌ కార్డ్ పొందడానికి డిజిటల్ కేవైసీని పొందడం అవసరం. టెలికమ్యూనికేషన్ శాఖ పేపర్ ఆధారిత కేవైసీని నిలిపివేయడమే దీనికి కారణం. దీంతో సిమ్ కార్డ్ మోసాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది.

ఐటీఆర్ ఫైలింగ్

మీరు జనవరి 1 నుంచి ఐటీఆర్ ఫైలింగ్ కోసం పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. వాస్తవానికి ఆలస్యమైన ఐటీఆర్ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. అటువంటి పరిస్థితిలో జనవరి 1 నుంచి జరిమానా విధించడం జరుగుతుంది.

Show comments