Dharani
PhonePe-Credit Line, UPI: ఫోన్‌పే వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా పేమెంట్స్ చేయవచ్చు. ఎలా అంటే..
PhonePe-Credit Line, UPI: ఫోన్‌పే వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా పేమెంట్స్ చేయవచ్చు. ఎలా అంటే..
Dharani
నేటి కాలంలో యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. వీటిల్లో గూగుల్ పే, ఫోన్‌పే వాడి చేసే పేమెంట్సే అధికం. పట్టణాలు మొదలు గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు విస్తరించాయి. అకౌంట్ నంబర్‌ని.. మొబైల్ నంబర్‌తో లింకప్ చేస్తే సరే.. ఎక్కడైనా పేమెంట్స్ చేసేయొచ్చు. కావాల్సిందల్లా నెట్ బ్యాలెన్స్, మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులుండటం. ఇదిలా ఉంటే తాజగా ఫోన్‌పే తన కస్టమర్లకు భారీ శుభవార్త చెప్పింది. వారి కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇక మీరు మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోయినా పేమెంట్స్ చేసేందుకు అవకాశం ఉంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి అనే వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే..
యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫోన్‌పే తాజాగా కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. అదే క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలు. ఈ కొత్త ఫీచర్ వల్ల మీరు ఇకపై మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు లేకున్నా పేమెంట్లు చేయొచ్చు. అయితే ఇందుకోసం ముందుగా మీరు మీ బ్యాంక్ నుంచి క్రెడిట్ లైన్ సౌకర్యం పొంది ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్‌ను వినియోగించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీకు గనక క్రెడిట్ లైన్ సౌకర్యం ఉంటే… దాన్ని ఫోన్‌పేతో లింక్ చేసుకోవచ్చు. తద్వారా ఫోన్‌పే నుంచి క్రెడిట్ లైన్‌తో.. ఖాతాలో నగదు లేకున్నా.. అత్యవసర పేమెంట్స్ చేయవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు.. ఖాతాలో డబ్బు లేకున్నా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్వల్ప కాలిక క్రెడిట్ ఫెసిలిటీని వినియోగించుకోవచ్చని తాజాగా ఫోన్‌పే వెల్లడించింది. కొత్త ఫీచర్ అందుబాటులోకి రావడం వల్ల ఫోన్‌పే వాడేవారికి అదనపు పేమెంట్స్ చేసే అవకాశం లభించినట్లైంది. ఈ కొత్త సదుపాయం వల్ల క్రెడిట్ వినియోగం బాగా పెరుగుతుందని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ తెలిపారు.
ఇక ఇటీవలనే కర్నాటక బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నవి టెక్నాలజీస్ ఈ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలు తీసుకువచ్చాయి. దీని వల్ల కస్టమర్లకు ఎంతో మేలు జరుగుతుంది.