టాటా గ్రూప్‌లోకి కొత్త తరం.. నివిల్లే టాటాకు స్టార్ బజార్ బాధ్యతలు!

టాటా గ్రూప్‌లో కొత్త తరం బాధ్యతలు స్వీకరణ మొదలైంది. తాజాగా రతన్ టాటా యువ తరానికి ఈ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇంతకీ రతన్ టాటా ఎవరికీ బాధ్యతలు అప్పగిస్తున్నరంటే..

టాటా గ్రూప్‌లో కొత్త తరం బాధ్యతలు స్వీకరణ మొదలైంది. తాజాగా రతన్ టాటా యువ తరానికి ఈ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇంతకీ రతన్ టాటా ఎవరికీ బాధ్యతలు అప్పగిస్తున్నరంటే..

దేశంలో అతి పెద్ద వాణిజ్య సంస్థల్లో టాటా గ్రూప్ సంస్థలు కూడా ఒకటి. ఇక టాటా గ్రూప్ సంస్థలు వ్యాపార రంగంలోని చెరగని ముద్ర వేసుకున్నాయి. ముఖ్యంగా రతన్ టాటా నేతృత్వంలో  ఉప్పు నుంచి బంగారం వరకు ఈ సంస్థలో ప్రవేశించని రంగం లేనిదంటూ లేదు. ఇలా ప్రతి రంగాల్లోని టాటా పేరు వినడబడుతునే ఉంటుంది. పైగా భారతీయులకు కూడా ఈ సంస్థ ఉత్పత్తులపై ఎనలేని నమ్మకం.  అయితే ఇప్పుడు అందరి చూపు ఈ టాటా గ్రూప్ సంస్థల మీదే ఉంది. ఎందుకంటే.. రతన్ టాటా తర్వాత టాటా గ్రూప్ వారసులు ఎవరు అనే చర్చలు మొదలైయ్యాయి. ఈ క్రమంలోనే.. టాటా గ్రూప్‌లో కొత్త తరం బాధ్యతలు స్వీకరణ మొదలైంది. తాజాగా రతన్ టాటా యువ తరానికి ఈ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

టాటా గ్రూప్, బ్రిటిష్ రిటైలర్ టెస్కో సంయుక్తంగా ఏర్పాటు చేసిన వెంచర్ ట్రెంట్ లిమిటెడ్. సార్ట్ మార్కెట్, వెస్ట్ సైడ్, జుడియో, జరా వంటి బ్రాండ్లతో రిటైల్ వ్యాపారాలు నిర్వహిస్తోంది. అయితే ఈ సంస్థలకు రతన్ టాటా తర్వాత ఎవరు బాధ్యతలు చూసుకుంటరనే అంశం పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే..  రతన్ టాటా తాజాగా టాటా గ్రూప్‌లోని రిటైల్ సంస్థ స్టార్ మార్కెట్ బజార్ బాధ్యతలను నెవిల్లే టాటా అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకీ ఈ నెవిల్లే టాటా ఎవరు? ఆయనకురతన్ టాటాక్ సంబంధం ఏమిటి అనే అంశం పై ఇప్పుడు నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అయితే నిజానికి 32 ఏళ్ల వయసులో ఉన్న నెవిల్లే టాటా, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సవతి సోదరుడు కావడం గమన్హారం. అంటే నోయల్ టాటా కుమారుడే ఈ నెవిల్లే టాటా. అయితే ప్రస్తుతం ఈయన ట్రెంట్ హైపర్ మార్కెట్ సంస్థలో బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు.  ఇకపోతే ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు చేపట్టిన క్రమంలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి వైదొలిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఇకపోతే నెవిల్లే టాటా బ్రిటన్‌లోని బేయెస్ బిజినెస్‌ స్కూల్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. అనంతరం 2016 నుంచి ట్రెంట్ లిమిటెడ్ బాధ్యతల నిర్వర్తిస్తున్నారు. అయితే మొదట ఆయన ఫుడ్ బేవరేజెస్ బిజినెస్‌లో తన సేవలందించగా.. ఆ తర్వాత రిటైల్ సంస్థ జుడియో నిర్వహరణ కార్యకలాపాలు చూశారు. దీని తర్వాత మళ్లీ  కొన్నేళ్లకు వేదేశాలకు వెళ్లి అక్కడ చదువుకున్నారు. కానీ, ఇప్పుడు టాటా గ్రూప్‌లో స్టాక్ బజార్ బాధ్యతలు చేపడుతున్నారు. కానీ, నెవిల్లేకు  కొంత కాలం పాటు  తన తండ్రి నోయల్ టాటా మార్గదర్శనం చేస్తారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. మరోవైపు నెవిల్లే టాటాతో పాటుగా ఇప్పటికే నోయల్ టాటా కుమార్తెలు సైతం టాటా గ్రూప్ కంపెనీల్లో వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. టాటా గ్రూప్‌లోని ఇండియన్ హోటల్స్ లో లేహ్ టాటా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Show comments