వాహనదారులకు అలర్ట్.. FASTag KYC గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే?

వాహనదారులకు గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ నో యువర్-కస్టమర్ అప్ డేట్ చేసుకోవడానికి గడువు తేదీని పొడిగించింది. గడువు లోగా కేవైసీ అప్ డేట్ చేయకపోతే ఖాతా డీయాక్టివేట్ అవుతుందని తెలిపింది.

వాహనదారులకు గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ నో యువర్-కస్టమర్ అప్ డేట్ చేసుకోవడానికి గడువు తేదీని పొడిగించింది. గడువు లోగా కేవైసీ అప్ డేట్ చేయకపోతే ఖాతా డీయాక్టివేట్ అవుతుందని తెలిపింది.

జాతీయ రహదారులపై ప్రయాణం చేసే సమయంలో టోల్ ప్లాజాల వద్ద సమయం వృథా కాకుండా వేగంగా దాటేందుకు ఫాస్టాగ్ ఉపయోగపడుతోంది. నేషనల్ హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల్లో టోల్ ఫీ చెల్లించడం తప్పనిసరి. కాగా ఫాస్టాగ్ యూజర్లు కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని కొంత కాలం నుంచి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచిస్తున్న విషయం తెలిసిందే. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని ఫాస్టాగ్ ఖాతాలను తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ వాటిని డీయాక్టివేట్ చేసి బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు హెచ్చరించారు. అయితే ఇప్పటికే కొంత మంది కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా కేవైసీ అప్ డేట్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించింది ఎన్ హెచ్ ఏఐ తాజాగా ఫాస్టాగ్ కేవైసీ గడువును పొడిగించింది.

ఒక వాహనానికి ఒక కేవైసీ ఉండాలనే ఉద్దేశ్యంతో వన్ వెహికల్, వన్ ఫాస్ట్‌ట్యాగ్ పాలసీని తీసుకొచ్చింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. వాహనదారులకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు జనవరి 31 వరకు గడువు విధించింది ఎన్ హెచ్ఏఐ. కేవైసీ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగకపోయే సరికి ఆ గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించింది. ఇక ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పేటీఎం ఫాస్టాగ్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని మరో సారి గడువును పెంచింది. తాజాగా ఎన్ హెచ్ఏఐ నో యువర్-కస్టమర్ అప్ డేట్ చేసుకోవడానికి గడువు తేదీని మార్చి 31, 2024 వరకు పొడిగించింది.

ఒకే ఫాస్టాగ్‌ను వివిధ వాహనాలకు వినియోగిస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ దృష్టికి వచ్చింది. కేవైసీ పూర్తి చేయకుండానే ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ఫాస్టాగ్ కేవైసీ తప్పనిసరి చేసినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మార్చి 31 నాటికి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని లేదంటే ఫాస్టాగ్ ఖాతా డియాక్టివేట్ అవుతుందని తెలిపింది. కేవైసీ అప్‌డేట్ చేయడానికి వాహన దారులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు సమయర్చిం అప్ డేట్ చేసుకోవచ్చు.

కేవైసీ ఇలా అప్‌డేట్ చేయండి:

  • మీరు మీ ఫాస్టాగ్‌ కేవైసీ స్టేటస్ తెలుసుకోవాలంటే ఫాస్టాగ్‌ అధికారిక వెబ్‌సైట్‌కి https://fastag.ihmcl.com సందర్శించాలి.
  • మీ మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా ఓటీపీ తో లాగిన్‌ కావాలి.
  • తర్వాత డ్యాష్‌ బోర్డులోకి వెళ్లి మై ప్రొఫైల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • అక్కడ మీ కేవైసీ స్టేటస్‌ వివరాలు కనిపిస్తాయి.
  • ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోయుంటే అడిగిన వివరాలు సమర్పించి ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది.
  • దీంతో మీ స్టేటస్ తెలుస్తుంది. మీ కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది.
  • అదే విధంగా ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి సైతం వివరాలు సమర్పించి కేవైసీ పూర్తి చేయవచ్చు.
Show comments