Paytm వాలెట్‌పై అంబానీ కన్ను.. Jioలో షేర్లు కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్స్!

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేటీఎం వాలెట్ బిజినెస్ ను దక్కించుకోనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ఎగబడుతున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేటీఎం వాలెట్ బిజినెస్ ను దక్కించుకోనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ఎగబడుతున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పేటీఎం వాలెట్ పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. వ్యాపార సామ్రాజ్యంలో ఎదురులేని శక్తిగా ఎదిగిన అంబానీ పేటీఎం వాలెట్ బిజినెస్ పై కన్నేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్ బ్యాంకుపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎం షేర్లు నేల చూపులు చూస్తూ భారీగా కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో పేటీఎం వాలెట్ బిజినెస్ ను దక్కించుకునేందుకు ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దక్కించుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక పేటీఎం వాలెట్ బిజినెస్ ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేయనుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ షేర్లు 16.25 శాతం పెరిగి రూ.295కు చేరాయి. ఇదే సమయంలో పేటీఎం షేర్లు మాత్రం మరో 10 శాతం కుప్పకూలాయి. పేటీఎం వాలెట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆధారపడి పనిచేస్తుంది.

నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్.. తమ వాలెట్ బిజినెస్‌ను విక్రయించేందుకు పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేటీఎం వాలెట్ బిజినెస్ ను దక్కించుకునేందుకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ముఖేష్ అంబానీ కొన్ని గంటల్లోనే లక్షకోట్లు ఆర్జించిన విషయం తెలిసిందే. బిఎస్‌ఇలో రిలయన్స్ షేరు ధర 6.90 శాతం ఎగబాకి 2897.40 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ పెరుగుదల కారణంగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ 285 నిమిషాల్లో రూ. 1.25 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 5 గంటల్లో రూ.1.25 లక్షల కోట్లు ఆర్జించింది.

Show comments