P Venkatesh
మెటా సీఈవో జూకర్ బర్గ్ కి భారీ షాక్ తగిలింది. ఒక్క రోజులోనే రూ. 24 వేల కోట్లు నష్టపోయారు. ఆ కారణంతో ఇంత భారీ మొత్తంలో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
మెటా సీఈవో జూకర్ బర్గ్ కి భారీ షాక్ తగిలింది. ఒక్క రోజులోనే రూ. 24 వేల కోట్లు నష్టపోయారు. ఆ కారణంతో ఇంత భారీ మొత్తంలో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందో వేరే చెప్పక్కర్లేదు. తమ ఆలోచనలను, ఆక్టివిటీని వ్యక్తపరిచేందుకు సామాజిక మాధ్యమాలనే వేదికలుగా ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియా యాప్స్ కొందరికి కాలక్షేపంగా మారగా, మరికొందరికి ఆదాయ వనరుగా మారి ఉపాధి పొందే వీలు ఏర్పడింది. సోషల్ మీడియా లేకపోతే క్షణం కూడా ఉండలేని పరిస్థితి దాపరించింది. అలాంటిది నిన్న (మంగళవారం) రాత్రి సమయంలో కాసేపు ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్స్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ మొరాయించిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా దాదాపు గంటసేపు సేవలు నిలిచిపోయాయి.
ఈ యాప్స్ వాడే యూజర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో యూజర్లు తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. మరోవైపు ఫేస్ బుక్, ఇన్స్టా యాప్స్ క్రాష్ అయ్యాయంటూ అను గందరగోళానికి గురయ్యారు. సేవలకు అంతరాయం కలగడంతో ఇన్స్టాలో కొత్త ఫీడ్ లోడ్ కాలేదు. ఫేస్ బుక్ లో కూడా లాగిన్ అవడానికి పాస్ వర్డ్ అడుగుతూ దర్శనమిచ్చాయి. ఆ తర్వాత కొంత సమయానికి ఈ యాప్స్ పనిచేయడం ప్రారంభించాయి. అయితే ఉన్నట్టుండి ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ సేవలు నిలిచిపోవడంతో ఈ ప్రభావం జూకర్ బర్గ్ సంపాదనపై పడింది.
మెటా సీఈవో జూకర్ బర్గ్ భారీ స్థాయిలో నష్టపోయారు. ఒక్క రోజులోనే ఏకంగా రూ. 24 వేల కోట్ల($3బిలియన్లు) సంపదను కోల్పోయారు. కాసేపు సేవల్లో అంతరాయానికే ఇంత భారీ మొత్తంలో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని తెలియజేసింది. జూకర్ బర్గ్ నికర విలువ $176 బిలియన్లకు చేరిందని వెల్లడించింది. కాగా జూకర్ బర్గ్ ప్రపంచవ వ్యాప్తంగా ఉన్నటువంటి ధనవంతుల జాబితాలో 4వ స్థానంలో కొనసాగుతున్నారు.