టెక్ ఉద్యోగులకు షాక్.. దిగ్గజ టెక్, రిటైల్ కంపెనీల్లో భారీగా తొలగింపులు

ఈ ఏడాది కూడా ఉద్యోగుల తొలగింపు వ్యవహారం టెక్ ఉద్యోగుల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు లే ఆఫ్స్ బాట పట్టాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఈ ఏడాది కూడా ఉద్యోగుల తొలగింపు వ్యవహారం టెక్ ఉద్యోగుల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు లే ఆఫ్స్ బాట పట్టాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

గత కొంత కాలంగా టెక్ ఉద్యోగులను కలవరపెడుతున్న విషయం ఏదైనా ఉందంటే అది లేఆఫ్స్ మాత్రమే. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ టెక్ కంపెనీలు, రిటైల్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు కోరుకునే వారికి ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. టెక్ కంపెనీల్లో కొత్తగా రిక్రూట్ మెంట్ లేకపోగా.. పై నుంచి లేఆఫ్స్ కొనసాగుతుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అయితే వివిధ టెక్ కంపెనీలు మాత్రం తమ ఖర్చులను తగ్గించుకునేందుకు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ టెక్, రిటైల్ కంపెనీల్లో భారీగా తొలగింపులు చోటుచేసుకుంటున్నాయి.

టిక్‌టాక్ తొలగింపులు

టిక్‌టాక్ తన అడ్వర్టైజింగ్ మరియు సేల్స్ యూనిట్‌లోని డజన్ల కొద్దీ కార్మికులను తొలగిస్తున్నట్లు తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 60 మంది ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు. బీజింగ్‌కు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్, తొలగింపులకు కారణాన్ని అందించలేదు.

మైక్రోసాఫ్ట్ తొలగింపులు

దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో దాదాపు 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో సహా వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను కంపెనీ తొలగిస్తుంది. మైక్రోసాఫ్ట్ గతేడాది యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను 68 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, మైక్రోసాఫ్ట్ గేమింగ్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ తన సిబ్బందికి ఈ-మెయిల్ పంపారు, అందులో మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న 22,000 మంది గేమింగ్ వర్కర్లలో 8 శాతం మందిని తొలగిస్తున్నట్లు వివరించారు.

గూగుల్ తొలగింపులు

గూగుల్ లో కూడా లే ఆఫ్స్ ఆగడం లేదు. తమ హార్డ్‌వేర్, వాయిస్ అసిస్టెన్స్ మరియు ఇంజనీరింగ్ టీమ్‌లలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఖర్చులను తగ్గించడానికి గూగుల్ మరియు దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ యొక్క ఎగ్జిక్యూటివ్‌ల ఆదేశాలనుసారం ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. గతేడాది గూగుల్ 12,000 మంది ఉద్యోగులను లేదా దాదాపు 6% మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.

అమెజాన్ తొలగింపులు

అమెజాన్ లో కూడా భారీగా ఉద్యోగుల కోతలు జరుగుతున్నాయి. ఖర్చులను ఆదా చేసే ప్రయత్నంలో 500 కంటే ఎక్కువ ఉద్యోగాలను తొలగిస్తోంది కంపనీ. అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ ఎంజీఎం స్టూడియో విభాగాల్లో పనిచేస్తున్న వారిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

మాకీ యొక్క తొలగింపులు

మాకీ దాని మొత్తం హెడ్‌కౌంట్‌లో 3.5% మందిని తొలగిస్తోందిఐకానిక్ డిపార్ట్‌మెంట్ స్టోర్ ఆర్లింగ్టన్, వర్జీనియాలో ఐదు స్థానాలను కూడా మూసివేస్తోంది; శాన్ లియాండ్రో, కాలిఫోర్నియా; లిహూ, హవాయి; సిమి వ్యాలీ, కాలిఫోర్నియా; మరియు తల్లాహస్సీ, ఫ్లోరిడా.

ఈబే తొలగింపులు

ఆన్‌లైన్ రిటైలర్ ఈబే దాదాపు 1,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ మెయిల్ ద్వారా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వ్యయ నింత్రణ చర్యల్లో భాగంగానే ఈ లేఆఫ్స్ ఉన్నాయని ప్రకటించింది. ఇలా ప్రముఖ కంపెనీలన్నీ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. కంపెనీ ఆర్థిక భారం తగ్గించుకునేందుకు టెక్ మరియు రిటైల్ కంపెనీలు లే ఆఫ్స్ దిశగా కొనసాగుతున్నాయి.

Show comments