ఆ పాలసీని ఉపసంహరించుకున్న LIC.. మీ డబ్బులు వెంటనే ఇలా పొందండి

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తన పాలసీదారులకు బిగ్ అలర్ట్ ను ఇచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన పాలసీని ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఇందులో చేరిన వారు పాలసీ సరెండర్ ఎలా చేయాలంటే?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తన పాలసీదారులకు బిగ్ అలర్ట్ ను ఇచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన పాలసీని ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఇందులో చేరిన వారు పాలసీ సరెండర్ ఎలా చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రజల కోసం వినూత్నమైన పాలసీలను ప్రవేశపెడుతూ ఉంటుంది. కోట్లాది మంది పాలసీహోల్డర్లను కలిగిన బీమా సంస్థగా ఎల్ఐసీ రికార్డ్ సృష్టించింది. ఎల్ఐసీలో పెట్టుబడి పెడితే మంచి రాబడులు వస్తుండడంతో పాటు ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బు సురక్షితంగా చేతికి అందుతుండడంతో ఎల్ఐసీ పాలసీల్లో పొదుపు చేసేందుకు ఇంట్రస్టు చూపిస్తుంటారు. అయితే ఎల్ఐసీ పాలసీదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన ఆ పాలసీని ఎల్ఐసీ ఉపసంహరించుకుంది. ఇంతకీ ఆ పాలసీ ఏంటి? అందులో ఇప్పటికే చేరిన వారు ప్రీమియం డబ్బులు ఎలా పొందాలి. ఆ వివరాలు మీకోసం.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఇండివిజువల్‌ సేవింగ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ధన్‌ వృద్దిని విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పాలసీని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా పాలసీదారులకు లైఫ్ కవర్‌తో పాటు పొదుపు సౌకర్యం కల్పిస్తోంది. పాలసీ టర్మ్‌లో పాలసీదారుడు మరణిస్తే అతడి కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది. మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో నగదు అందిస్తుంది. కాగా ఎల్ఐసీ తీసుకున్న నిర్ణయంతో ఇకపై ధన్‌ వృద్ది పాలసీ అందుబాటులో ఉండదు.

కాగా ఎల్‌ఐసీ ధన్ వృద్ధి సింగిల్ ప్రీమియం ప్లాన్. ఇది 10, 15 లేదా 18 సంవత్సరాల కాలవ్యవధికి అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన కాలాన్ని బట్టి కనీస ప్రవేశ వయస్సు 90 రోజుల నుండి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. పాలసీ కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ. 1,25,000. జీవిత బీమా పాలసీ వ్యవధిలో రిస్క్ ప్రారంభ తేదీ తర్వాత కానీ నిర్ణీత గడువు తేదీకి ముందు పాలసీదారులు మరణిస్తే.. నిబంధనల ప్రకారం ప్రయోజనాలు సంబంధిత పాలసీ దారుడి కుటుంబానికి అందుతాయి. మరి ఎల్ఐసీ ఈ పాలసీని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఇందులో చేరిన వారు ప్రీమియం డబ్బును ఎలా పొందాలి.

పాలసీని ఎలా సరెండర్ చేయాలంటే? పాలసీ టర్మ్ సమయంలో పాలసీదారు ఏ సమయంలోనైనా సరెండర్ చేయవచ్చు. పాలసీని సరెండర్ చేసినప్పుడు గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ, స్పెషల్ సరెండర్ వాల్యూ కంటే ఎక్కువ సరెండర్ విలువను కార్పొరేషన్ చెల్లిస్తుంది. అయితే గ్యారెంటీడ్ సరెండవ్ వాల్యూ అనేది తొలి మూడేళ్లలో సరెండ్ చేస్తే ప్రీమియంలో 75 శాతం చెల్లిస్తారు. ఆ తర్వాత అయితే 90 శాతం సరెండర్ వాల్యూ ఉంటుంది. అదనంగా ఆర్జిత గ్యారెంటీడ్ అడిషన్ల సరెండర్ విలువ చెల్లిస్తారు.

Show comments