Jio Rs 1029-Free Amazon Prime, 84 Days: రేట్లు పెంచినా Jio అదిరిపోయే ఆఫర్‌! ఇది చాలా మందికి తెలియదు!

రేట్లు పెంచినా Jio అదిరిపోయే ఆఫర్‌! ఇది చాలా మందికి తెలియదు!

Jio Rs 1029-Free Amazon Prime: రేట్లు పెంచిన జియో.. తన కస్టమర్లకు మరో అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది. అయితే దీని గురించి చాలా మంది తెలియదు. ఇంతకు ఆ ఆఫర్‌ ఏంటి.. దాని పూర్తి వివరాలు మీ కోసం..

Jio Rs 1029-Free Amazon Prime: రేట్లు పెంచిన జియో.. తన కస్టమర్లకు మరో అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది. అయితే దీని గురించి చాలా మంది తెలియదు. ఇంతకు ఆ ఆఫర్‌ ఏంటి.. దాని పూర్తి వివరాలు మీ కోసం..

గత నెల దేశంలోని ప్రైవేటు టెలికాం కంపెనీలన్ని రీఛార్జ్‌ ప్లాన్‌ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ కంపెనీలు తన రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచాయి. ఒక్కో ప్లాన్‌ మీద 25 శాతం వరకు పెంచడంతో.. ఏకంగా వంద రూపాయల వరకు పెరిగాయి. ఇక ప్రైవేటు టెలికాం కంపెనీలన్ని రీఛార్జ్‌ రేట్లను పెంచడంతో.. ఈ కంపెనీలకు చెందిన కస్టమర్లు.. వేరే నెట్‌వర్క్‌కు మారుతున్నారు. ఎక్కువ మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు చూస్తున్నారు. కొద్ది రోజుల్లోనే లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. దాంతో ప్రైవేటు టెలికాం కంపెనీలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ ఎంట్రీ లెవల్‌ ప్లాన్స్‌ పేరుతో రెండు కొత్త ప్యాక్‌లను తీసుకువచ్చింది. ఇక జియో తన కస్టమర్లకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

జియో తన ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అందించే ప్లాన్ల జాబితాలో కొన్ని మార్పులు చేసింది. దీనిలో భాగంగా ఇకపై జియో కస్టమర్లు.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెబ్ సిరీస్ లేదా మీకు ఇష్టమైన సినిమా చూడాలనుకుంటే ప్రత్యేకంగా సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాంప్లిమెంటరీ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను 84 రోజుల వ్యాలిడిటీతో పాటు జియో కస్టమర్లకు రోజువారీ డేటాను అందిస్తుంది. అంటే మొబైల్ డివైజ్‌లకు ప్రైమ్ వీడియో యాక్సెస్‌తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

జియో కస్టమర్లు కనుక ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే రూ.1,029 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవాలి. దీన్ని రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు రానున్నాయి. ఇక ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. దీనితో పాటు అదనంగా లభించే ప్రయోజనాల్లో.. భాగంగా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ యాప్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ బెనిఫిట్ 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఎడిషన్‌తో, మీరు స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ స్క్రీన్ పై ప్రైమ్ వీడియో కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు.

అర్హులైన చందాదారుల కోసం తీసుకువచ్చిన ఈ ప్లాన్‌ రూ .1,029 ధరతో అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అంటే మీరు జియో 5జీ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతంలో ఉండి.. 5జీ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే.. మీరు అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని పొందుతారు.

Show comments